Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ 19 : మళ్లీ పెరుగుతున్న కేసులు.. మరణాలూ అదేబాటలో..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 40 వేల దిగువకు పడిపోయిన కేసులు.. వరుసగా రెండో రోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. ఈ మేరకు  గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

Coronavirus live updates: India reports 48,786 new Covid-19 cases, 1,005 deaths in last 24 hours - bsb
Author
Hyderabad, First Published Jul 1, 2021, 10:33 AM IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 40 వేల దిగువకు పడిపోయిన కేసులు.. వరుసగా రెండో రోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. ఈ మేరకు  గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

తాజాగా 19, 21,450 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 48,786 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే ఆరు శాతం పెరుగుదల కనిపించింది.  24 గంటల వ్యవధిలో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు మరణాల సంఖ్య 817 గా ఉంది. ఇప్పటివరకు 3,04,11,634 మందికి  కరోనా సోకగా 3,99,459 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 523252 మంది కోవిడ్ తో బాధపడుతుండగా... క్రియాశీల రేటు 1.77 శాతానికి తగ్గింది. రేటు 96.92 శాతానికి పెరిగింది.  నిన్న ఒక్కరోజే 61,588 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం రికవరీలు 2.94 కోట్ల మార్కును దాటాయి.  మరోపక్క నిన్న 27,60,345 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 33,57,16,019కి చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios