Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా కేసుల రికార్డ్.. గత 24గంటల్లో

వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 33 లక్షల 87 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 77,266 కేసులు నమోదు కాగా, 1057మంది ప్రాణాలు విడిచారు

Coronavirus live updates: India records fresh single-day high of 77,266 cases, tally rises to 33.87 lakh
Author
Hyderabad, First Published Aug 28, 2020, 11:27 AM IST


భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో 77,266 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. 

వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 33 లక్షల 87 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 77,266 కేసులు నమోదు కాగా, 1057మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,177మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 33,87,500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,42,023 ఉండగా, 25,83,984 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 61,529 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.28 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.82 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93 శాతంగా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios