కరోనా కేసులు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు జైళ్లలోనా కరోనా కేసులు రిపోర్ట్ కావడం ఆందోళనకరంగా మారింది. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో 9 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు.
ముంబయి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయమై ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నాయి. అలాగే, కరోనా నిబంధనలు మళ్లీ అమలు చేయడానికి కసరత్తులు చేస్తున్నాయి. కేసులు పెరగడమే కాదు.. జైళ్లలోనూ కేసులు రిపోర్ట్ కావడం ఆందోళనలను కలిగిస్తున్నాయి. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో తొమ్మిది మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 12 మంది ఖైదీలకు కరోనా టెస్టులు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం వారు కరోనా టెస్టులు చేశారు. ఆ శాంపిళ్లలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా పాజిటివ్ అని తేలడంతో కాంటాక్ట్ ట్రేసింగ్‌ను జైలు అధికారులు నిర్వహించారు. కాగా, శుక్రవారం వచ్చిన ఫలితాల్లో మరో ఐదుగురికీ కరోనా పాజిటివ్ ఉన్నట్టు వచ్చింది. దీంతో ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో కరోనా పేషెంట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఖైదీల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, వారందరినీ క్వారంటైన్ చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
నాగ్‌పూర్‌లోనూ కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 65 కొత్త కేసులు రిపోర్ట్ అయినట్టు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం 1899 శాంపిళ్లను కరోనా టెస్టు కోసం సేకరించారు. ఇందులో 65 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. అందులో ఐదుగురు ఖైదీలు కూడా ఉన్నారు. అలాగే, ఆ 24 గంటల్లోనే 60 మంది పేషెంట్లు కరోనా నుంచి రికవరీ అయ్యారు.
దేశంలో కొత్తగాా 15,940 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, 20 మంది కరోనా పేషెంట్లు మహమ్మారి కారణంగాా ప్రాణాలు వదిలారు. కొత్త కేసుల సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసులు కూడా గత రోజు 3,495 పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో 91,779 యాాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగాా వెల్లడించింది.
