భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి.  నిన్నటి రోజున కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా మరలా విజృంభించింది.  తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో 64,531 కేసులు నమోదయ్యాయి.  

దీంతో భారత్ లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,67,273కి చేరింది.  ఇందులో 20,37,870 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,76,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా కారణంగా 1092 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,889కి చేరింది.  కాగా.. ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్  నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. దేశంలో రికవరీ రేటు కాస్త ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 60వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 73శాతం దాటింది.