భారతదేశంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 57,118 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,95,988 కి చేరుకుంది.   ఇప్పటివరకు ఒక్కరోజులో నమోధ్జైన అత్యధిక కేసులు ఇవే. నిన్నొక్కరోజే 764 మరణాలు సంభవించాయి. దీనితో ఇప్పటివరకు   మరణించినవారి సంఖ్య 36,511 కు చేరుకుంది. 

15 లక్షల మార్కును దాటిన మూడు రోజులకే భారతదేశం 16 లక్షల మార్కును దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి 10 లక్షల 94వేల మంది కోలుకున్నారు. 64.52 శాతంగా రికవరీ రేటు ఉంది. 

కేరళలో తొలి కేసు నమోదైన నాటి నుండి లక్ష మార్కును చేరుకోవడానికి 110 రోజుల సమయం పడితే.... 16 లక్షల మార్కును కేవలం మరో 73 రోజులు మాత్రమే పట్టింది. కరోనా విస్తరిస్తున్న వేగాన్ని మనకు ఈ లెక్కలే చూపెడుతున్నాయి. 

ఇరు తెలుగు  కరోనా కేసులు  పెరుగుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 10376 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 64 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఆస్పత్రుల నుంచి 60,969 మంది డిశ్చార్జీ కాగా, 75,720 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 40 వేల 933కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 1349కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో చిత్తూర జిల్లాలో 789, తూర్పు గోదావరి జిల్లాలో 1215, గుంటూరు జిల్లాలో 906, కడప జిల్లాలో 646, కృష్ణా జిల్లాలో 313, నెల్లూరు జిల్లాలో 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో తెలంగాణలో 2083 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ మృతులసంఖ్య 530కి చేరుకుంది. 

హైదరాబాదులో మాత్రం కరోనా వైరస్ ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో జిహెచ్ఎెంసీ పరిధిలో 578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఎక్కువగాకరోనా వైరస్ కేసుల నమోదవుతున్నాయి.