భారత నౌకాదళంలో కరోనా కలకలం: పాజిటివ్ గా తేలిన 21 మంది సిబ్బంది

భారత నేవీలో పనిచేస్తున్న 21 మంది నావికులకు కరోనా వైరస్ సోకింది. వీరందరిని ముంబై నగరంలోని ఒక నేవల్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 

Coronavirus India: 21 Navy Sailors In Mumbai Test COVID-19 positive

కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని వణికిస్తోంది. తాజాగా భారత నేవీలో పనిచేస్తున్న 21 మంది నావికులకు కరోనా వైరస్ సోకింది. వీరందరిని ముంబై నగరంలోని ఒక నేవల్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 

ఈ 21 మంది నావికులకు ఈ కరోనా వైరస్ ఎలా సోకి ఉండవచ్చు అనే దానిపై ఇప్పటికే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఐఏఎన్ఎస్ ఆంగ్రే అనే ముంబై నగరంలోని నావికాదళ కేంద్రంలో వీరంతా పనిచేస్తున్నట్టు నేవీ అధికారులు తెలిపారు. 

భారతీయ నావికాదళంలో ఏ వార్ షిప్ లో కానీ, జలాంతర్గామిలో కానీ కరోనా వైరస్ బారినపడ్డ వారు ఎవరూ లేరని భారత నౌకాదళం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ముంబై నగరమంతా లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ అత్యవసర విధుల నేపథ్యంలో వీరంతా ఇతర నావికాదళ కేంద్రాల్లో తిరిగినందున వీరి పూర్తి కదలికలను ట్రాక్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వీరు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ బ్లాక్ ను అత్యవసరంగా కొన్ని రోజులపాటు నేవీ మూసేసింది. 

3300 కేసులతో కరోనా వైరస్ వల్ల అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిస్తే.... అత్యధిక ప్రభావితమైన నగరంగా ముంబై నిలిచింది. 

గతంలో కరోనా సోకినా ఒక వ్యక్తి ద్వారా వీరందరికి కరోనా సోకినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఏప్రిల్ 7వ తేదీన ఒక నావికుడు కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడు ఈ కొత్త కేసులు కూడా ఆ వ్యక్తి ద్వారా సంక్రమించనావే అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలు కనిపించకపోయినప్పటికీ.... వీరందరూ కూడా కరోనా పాజిటివ్ గా తేలారు.  

ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 991 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 14,378కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 448కి చేరుకుంది. 

ఒడిశాకు కొంత ఊరట లభించింది. గత మూడు రోజులుగా ఒడిశాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెంపులో తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి తగ్గిందని చెప్పింది.

రికవరీ రేటు శనివారం అత్యధికంగా నమోదైంది. మహారాష్ట్ర కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతూనే ఉన్నది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 286 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంంబైలోనే 177 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 194కు చేరుకుంది.

ఇండియన్ నేవీలో 20 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.తెలంగాణలో 766 కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios