దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనాతో బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కర్ణాటకలోని బెంగళూరు కరోనా కేసుల్లో టాప్ లో ఉంది. 

కర్ణాటక రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్‌ కేసులలో 60 శాతానికిపైగా  బెంగళూరులోనే ఉంటున్నాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో మంగళవారం 31,830 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కాగా వీరిలో 17,550 మంది  బెంగళూరుకి చెందిన వారికే వైరస్‌ సోకింది. 

మైసూరులో 2,042, తుమకూరులో 1196, బళ్లారిలో 907, మండ్య 737, కలబుర్గి 772, బెంగళూరు గ్రామీణ 599, చిక్కబళ్ళాపుర 544, హాసన్‌ 503, కోలారు 548, విజయపుర 531 మందికి పాజిటివ్‌ గా తేలింది. 

ఇప్పటివరకు 60-70 మందికే పరిమితైన హావేరి జిల్లాల్లోనూ 99మంది బాధితులయ్యారు. మిగిలిన జిల్లాల్లో 100-500 మంది బాధితులు నమోదయ్యారు. కాగా తాజాగా రాష్ట్రంలో 10,793 మంది కోలుకోగా 10.84 లక్షల మంది కొవిడ్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

180 మంది మృతి చెందగా బెంగళూరులోనే 97మంది, బళ్లారి 18, మైసూరులో 9మంది కాగా మిగిలిన జిల్లాల్లో 8మందిలోపు ఉన్నారు. 3,01899 మంది చికిత్సలు పొందుతుండగా.. వీరిలో 2,063 మంది ఐసీయూలో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 14 లక్షలు అధిగమించింది.