coronavirus : నేడు తమిళనాడులో పూర్తి స్థాయి లాక్ డౌన్
తమిళనాడులో కరోనా కేసుల పెరుగదల నేపథ్యంలో ఆ రాష్ట్రం నేడు పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయనుంది.కొన్ని అత్యవసర సేవలకు మాత్రమే ఈ సమయంలో మినహాయంపు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో దాదాపు 24 వేల కేసులు నమోదయ్యాయి.
కరోనా (corona) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. కోవిడ్ -19 కట్టడి కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా నైట్ కర్ఫ్యూ (night curfew), వీకెండ్ లాక్ డౌన్ ను (weekend) అమలు చేస్తున్నాయి. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాయి. టీనేజర్లకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drive) వేగంగా సాగుతోంది.
తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రం నేడు (ఆదివారం) పూర్తి స్థాయి లాక్ డౌన్ (full lockdown) పాటించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను గతంలోనే విడుదల చేసింది. కోవిడ్ వ్యాప్తిని తగ్గించడంలో భాగంగా తమిళనాడులో ఇప్పటికే ప్రతీ రోజు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ కర్ఫ్యూ సమయం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలలో ఉంటుంది. ఈ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
తమిళనాడులో దేవాలయాలు అధికంగా ఉండటం వల్ల సంక్రాంతి సమయంలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలును మూసి వేశారు. ఈ నేషధం జనవరి 18వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అయితే ఇందులో సాధారణ భక్తులకు మాత్రమే నిషేధం విధించారు. ప్రతీ రోజు జరగాల్సిన పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. తమిళనాడు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23,989 కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 29,15,948కి చేరుకోగా.. మరణాల సంఖ్య 36,967కి చేరుకుంది. శుక్రవారం నాడు 23,459 కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. అయితే ఇందులో ఒక్క చైన్నై(chennai) నగరంలోనే 8,963 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
వీకెండ్ లాక్ డౌన్ లో వీటికే మినహాయింపు..
నేడు తమిళనాడులో (thamilnadu) నిర్వహించే లాక్ డౌన్ లో కొన్ని అత్యవసర సేవలకే అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో పాలు, ఏటీఎం కేంద్రాలు, హాస్పిటల్, హాస్పిటల్ కు సంబంధించిన పనులు, సరుకు రవాణా, పెట్రోల్ బంక్‌లు మొదలైన ముఖ్యమైన సేవలు పనిచేస్తాయి. మెట్రో, ప్రజా రవాణా సేవలు పూర్తిగా కొనసాగవు. రెస్టారెంట్లు, హోటళ్లు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పార్శిల్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
విమాన, రైలు ద్వారా తమిళనాడుకు వచ్చే ప్రయాణికులు, రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ టికెట్ ను వెంట ఉంచుకోవాలి. కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించి ఇంట్రా ప్రైవేక్, పబ్లిక్ రవాణాకు అనుమతి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పాల సరఫరా, వార్తాపత్రికల పంపిణీతో పాటు ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు, మెడికల్ షాపులు, అంబులెన్స్‌లు, శవవాహన సేవలు వంటి సేవలకు అనుమతి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ బంకులు పనిచేస్తాయి. ఆఫీసు నుంచి పని చేసే ఉద్యోగులు తమ ఐడీ కార్డులు వెంట ఉంచుకోవాలి.