కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికిపోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది.  

భారతదేశంపై కూడా ఈ మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో భారత దేశం ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పూర్తి లాక్ డౌన్ లో ఉన్నాయి. 

ప్రభుత్వం ప్రజలను జనసమ్మర్థమైన ప్రదేశాలను పూర్తిగా అవొఇద్ చేయాలనీ కోరుతున్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ వల్ల పరీక్షల నుంచి మొదలుకొని అనేక అధికారిక కార్యక్రమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే! 

తాజాగా ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రతి రెండేళ్లకోసారి రాజ్యసభకు క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలను ఈ కరోనా వైరస్ మూలంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. 

పార్లమెంటులో ఇప్పటికే కరోనా భయం ప్రబలంగా ఉంది. దుశ్యంత్ సింగ్ వ్యవహారంలో అందరూ వణికిపోతున్నారు. సింగర్ కనిక కపూర్ విందుకు హాజరైన బిజెపి పార్లమెంటు సభ్యుడు దుష్యంత్ సింగ్ చాలా మంది ఎంపీలను కలిశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారు. దీంతో ఎంపీల్లోనూ భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

బ్రిటన్ నుంచి వచ్చిన కనిక కపూర్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన కనిక కపూర్ పార్టీకి దుష్యంత్ సింగ్ తో పాటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా క్వారెంటైన్ కు వెళ్లారు. కనిక కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

Also Read: యూకే ప్రయాణం దాచి, పార్టీలో కేరింతలు: కనికాపై యూపీ సర్కార్ సీరియస్

దుష్యంత్ సింగ్ ను కలిసిన పార్లమెంటు సభ్యులు పలువురు తమంత తాము క్వారంటైన్ లోకి వెళుతున్నారు. గత వారం రోజుల్లో వారు దుష్యంత్ సింగ్ ను పలుమార్లు కలిశారు. మూడు రోజుల క్రితం దుష్యంత్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన పలువురు ఆయనతో పాటు రాష్ట్రపతి భవన్ లో జరిగిన అల్పాహార విందుకు హాజరయ్యారు. 

Also Read: కనికా కపూర్‌కు కరోనా : ఆ ప్రముఖులకు వెన్నులో వణుకు.. హోమ్ క్వారంటైన్‌లో వసుంధర రాజే

తృణమూల్ కాంగ్రెసు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సెల్ఫ్ క్వారంటైన్ కు చేసుకున్నారు. ట్రాన్స్ పోర్ట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుష్యంత్ పక్కన తాను రెండున్నర గంటల పాటు కూర్చున్నానని ఆయన చెప్పారు. 

ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్, కాంగ్రెసు నేతలు దీపేందర్ హుడా, జితిన్ ప్రసాద కూడా ఏకాంతవాసంలోకి వెళ్లారు. రాష్ట్రపతి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హేమమాలినితో పాటు పలువురు ఎంపీలు దుష్యంత్ ను కలిసినట్లు తెలుస్తోంది.