కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అతలాకుతలమౌతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ న్యూస్ తెలియజేసింది.

కరోనాకు త్వరలోవ్యాక్సిన్ వస్తుందనే ప్రపంచం ఆశిస్తుండగా... అది సాధ్యపడదని, ఇక చికిత్స కూడా లేదని స్పష్టం చేసింది. ‘ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ సాధ్యం కాదు. భవిష్యత్తులోనూ సాధ్యపడకపోవచ్చు. భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్ల పైనే ప్రజలు దృష్టి పెట్టాలి. ఆ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సిందే’నని స్సష్టం చేసింది. 

డబ్ల్యూహెచ్‌వో నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది రెండోసారి.  ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడామ్ గిబ్రేయెసస్ కిందటి నెలలో  ఓ సందర్భంలో మాట్లాడుతూ… సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.