న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మృతుల సంఖ్య 9కి చేరింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో 55 ఏళ్ల వ్యక్తి తాజాగా మరణించాడు. దీంతో ఆ సంఖ్య 9కి చేరింది. దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో సోమవారం మరో వ్యక్తి మరణించాడు. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 3కు చేరుకుంది. తాజాగా పిలిప్పైన్స్ కు చెందిన ఓ వ్యక్తి ముంబైలో మరణించాడు 

ఆదివారంనాడు మూడు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆదివారం ఒక్కరేసి మరణించారు. కరోనాను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఆంక్షల ప్రభావం పడకుండా నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్తిక సాయం ప్రకటించాయి. 

దేశంలోని 19 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. 15వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలని సూచించింది. అత్యవసర సర్వీసులు ఉంటాయని చెప్పింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పింది. కోవిడ్ బాధితుల కోసం ఆస్పత్రులను సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.