ఇండియాలో పదివేలు దాటిన కరోనా కేసులు: 339 మంది మృతి
గత 14 రోజులుగా దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ తో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. మహారాష్ట్రలో 2,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 160 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 352 కేసులు నమోదు కాగా, 11 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలో 1,540 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 101 మంది మృత్యువాత పడ్డారు.
సోమవారంనాటి లెక్కల ప్రకారం కర్ణాటకలో 8 మంది కరనా పాజిటివ్ తో మరణించారు. బెంగళూరులో సోమవారంనాడు 65 ఏళ్ల వ్యక్తి మరణిం్చాడు. దీంతో మృతుల సంఖ్య 8కి పెరిగింది. ఇదిలావుంటే, ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ గడువు నేటితో ముగుస్తుండడంతో తర్వాతి వ్యూహాన్ని ఆయన వివరించనున్నారు. లాక్ డౌన్ విధానాన్ని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.