Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా అల్ టైం రికార్డు: వరుసగా రెండో రోజు కూడా 8వేలు దాటిన కేసులు

నిన్న 8,380 కరోనా కేసులు నమోదయితే, నేడు ఎక్కువగా 8,392 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదయిన అత్యధిక కేసుల నిన్నటి రికార్డును ఇవి బద్దలు కొట్టాయి. మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,394 మంది మరణించారు. 

Coronavirus Cases Updates India: Cases Cross 8 thousand for the second Consecutive Day
Author
New Delhi, First Published Jun 1, 2020, 9:43 AM IST

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న 8వేల పై చిలుకు కేసులు నమోదయి భయపెడితే, నేడు సైతం(ఉదయం 8 గంటల వరకు ఉన్న డేటా ఆధారంగా) 8వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 

నిన్న 8,380 కరోనా కేసులు నమోదయితే, నేడు ఎక్కువగా 8,392 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదయిన అత్యధిక కేసుల నిన్నటి రికార్డును ఇవి బద్దలు కొట్టాయి. మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,394 మంది మరణించారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్ డౌన్ ను కూడా సడలించడంతో కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూ ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,88,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ ఫ్రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. 

18 లక్షల పైచిలుకు కేసులతో అమెరికా అగ్ర స్థానములో ఉండగా, ఆతరువాత 5 లక్షల పైచిలుకు కేసులతో బ్రెజిల్, నాలుగు లక్షల కేసులతో రష్యా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే  విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. 

కంటైన్మెంట్ జోన్లలో పూర్తి  స్ధాయి  లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో  కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి  9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.

 
ఇక జూన్ 8 తర్వాత  సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు.  సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios