Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ : దేశంలో తగ్గని ఉదృతి.. తెలంగాణలో ఏడువేలకు పై చిలుకు..

కరోనాతో దేశంలో రోజురోజుకూ పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 

coronavirus cases : india reports new 3,92,488 cases - bsb
Author
Hyderabad, First Published May 2, 2021, 10:39 AM IST

కరోనాతో దేశంలో రోజురోజుకూ పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 

3,689 మంది ప్రాణాలు విడిచారు. 3,07,865 మంది ఈ వైరస్ ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,59,92,271గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,95,57,457 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇందులో 33,49,644 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 15,68,16,031 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 2,15,542మంది కరోనాకు బలయ్యారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7430కరోనా కేసులు నమోదవగా 56 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,50,790కి చేరింది.

ఇప్పటివరకు 3,67,727 మంది డిశ్చార్జ్ అవ్వగా 2,368మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 80,695 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 1,546, మేడ్చల్ లో 533, రంగారెడ్డిలో 475, నల్లగొండలో 368, సంగారెడ్డిలో 349 కరోనా కేసులు నమోదవగా వరంగల్ అర్బన్ లో 321, నిజామాబాద్ లో 301 కేసులు వెలుగుచూశాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios