భారత్ లో కరోనా విలయతాండవం: ఒక్కరోజే 8వేల కేసుల నమోదు

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తూనే ఉంది. నిన్నొక్కరోజే అత్యధికంగా 8,380 కేసులు నమోదయ్యాయి. వైరస్ కేసులు భారతదేశంలో నమోదవడం మొదలైనప్పటినుండి నిన్ననే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు నిన్నటి కన్నా ఎక్కువ కేసులు నమోదవడం అందరిని కలవరపెడుతున్న అంశం. 

Coronavirus Cases India: Over 8 Thousand cases on a single day

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తూనే ఉంది. నిన్నొక్కరోజే అత్యధికంగా 8,380 కేసులు నమోదయ్యాయి. వైరస్ కేసులు భారతదేశంలో నమోదవడం మొదలైనప్పటినుండి నిన్ననే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు నిన్నటి కన్నా ఎక్కువ కేసులు నమోదవడం అందరిని కలవరపెడుతున్న అంశం. 

ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 5,164 మంది మరణించారు. రికవరీ రేట్ 47.75 శాతంగా ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు 1,82,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86,984 మంది   కోలుకున్నారు. నిన్నొక్కరోజే ఈ కరోనా వైరస్ బారినపడి 193 మంది మరణించగా, వీరితో కలుపుకొని ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,164. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే  విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. 

read more  ఎయిర్ ఇండియా పైలట్ కి కరోనా, గమ్యస్థానం చేరకముందే విమానం వెనక్కి!

కంటైన్మెంట్ జోన్లలో పూర్తి  స్ధాయి  లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో  కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి  9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.
 
ఇక జూన్ 8 తర్వాత  సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు.  సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios