Asianet News TeluguAsianet News Telugu

దేశంలో 8లక్షలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజే రికార్డు స్థాయిలో 27 వేలు

నిన్నొకే రోజు కనీ విని ఎరుగని రీతిలో 27,114 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

Coronavirus Cases India: cases rise to 8,20,916, all time single day high of 27,114
Author
New Delhi, First Published Jul 11, 2020, 10:42 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిన్నొకే రోజు కనీ విని ఎరుగని రీతిలో 27,114 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

నిన్న నమోదైన కేసులతో భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 8లక్షల మార్కును దాటింది. ఈ కేసుల్లో 2,83,407 ఆక్టివ్ కేసులు కాగా, 5,15,387 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 22,123 మంది మరణించారు. 

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ కరోనా కి హొయ్త్ స్పాట్స్ గా మారాయి. అక్కడ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ కష్టకాలంలో ఒక్క ఊపిరిపీల్చుకునే అంశం ఏమిటంటే.... మరణాల రేటు 2.72 శాతానికి తగ్గింది. 

అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఒక కోటి పైచిలుకు సాంపిల్స్ ని టెస్ట్ చేసారు. నిన్నొక్కరోజే దాదాపుగా మూడు లక్షల సాంపిల్స్ ని టెస్ట్ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. 

తెలంగాణాలో కూడా కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తుంది. తాజాగా శుక్రవారం 1,278 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరింది. ఇవాళ 8 మంది మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 339కి చేరుకుంది. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 762 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ తర్వాత రంగారెడ్డి 171, మేడ్చల్ 85, సంగారెడ్డి 36, ఖమ్మం 18, కామారెడ్డి 23, మెదక్ 22, నల్గొండ 32, ఆదిలాబాద్ 14, సూర్యాపేట 14, నారాయణ పేట 9, నిజామాబాద్‌‌లలో 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,680 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 19,205 మంది కోలుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios