న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో 37,148 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 587 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసులు 11,55,191కి చేరుకొన్నాయి. ఇందులో 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా సోకిన 7,24,578 మంది కోలుకొన్నారు. మరోవైపు కరోనా సోకి దేశంలో 28,084 మంది మరణించారు. వరుసగా ఆరో రోజున 30వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 

పంజాబ్ రాష్ట్రంలో 411 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,510కి చేరుకొన్నాయి. ఇందులో 3,130 యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 8మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 262కి చేరింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న  ఒక్కరోజే 110 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1632కి చేరుకొన్నాయి. ఇందులో 475 యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది.

also read:కరోనా భయం: భర్త డెడ్‌బాడీని తోపుడు బండిపై తీసుకెళ్లిన భార్య

బీహార్ రాష్ట్రంలో 196 కొత్త కేసులు రికార్దయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,455కి చేరుకొన్నాయి. వీటిలో 9,732 యాక్టివ్ కేసులు. గత 24 గంటల్లో కరోనాతో 8  మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 187కి చేరుకొంది.

గోవా రాష్ట్రంలో మొత్తం కేసులు 3853కి చేరుకొన్నాయి. ఇందులో యాక్టివ్ కేసులు 1469. రాష్ట్రంలో కరోనాతో 23 మంది మరణించారు.

గత 24 గంటల్లో మరణించిన 587 మందిలో ఎక్కువగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 176, కర్ణాటకలో 72, తమిళనాడులో 70, ఆంధ్రప్రదేశ్ లో 54, ఉత్తర్‌ప్రదేశ్ లో 46, బెంగాల్, డిల్లీ  రాష్ట్రాల్లో 35 , గుజరాత్ లో20, మధ్యప్రదేశ్ లో 17, జమ్మూకాశ్మీర్ లో 10 మంది చనిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.