ఒక్క రోజులో 5 వేలు దాటిన కరోనా కేసులు: అతి పెద్ద జంప్ ఇదే...
ఒక్క రోజులో భారతదేశంలో 5 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులు ఇంత భారీగా కోవిడ్ -19 కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తం మరణాల సంఖ్య 3 వేలు దాటింది.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఒక్క రోజులో తొలిసారి 5 వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5242 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 96,169కి చేరుకుంది.
తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 157 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3029కి చేరుకుంది. ఇప్పటి వరకు 36,823 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 36823కు చేరుకుంది.
మహారాష్ట్ర కరోనా వైరస్ వ్యాధితో అట్టుడుకుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 33053కు చేరుకున్నాయి. గుజరాత్ లో 11379 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. తమిళనాడులో 11,224 కేసులు నమోదయ్యాయి.ఢిల్లీలో 10054 కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2230 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 1551 కేసులు రికార్డయ్యాయి.