24 గంటల్లో ఇదే అతి పెద్ద జంప్: ఇండియాలో 35 వేలు దాటిన కరోనా కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ -19 మహమ్మారికి దేశంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా దేశంలో కరోినా వైరస్ కేసులు 35 వేలు దాటాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 35 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో ఇప్పటి వరకు అత్యధిక కేసులు తాజాగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు కోవిడ్ -19తో 1,147 మంది మృత్యువాత పడ్డారు.
గత 24 గంటల్లో కొత్తగా కరోనా వైరస్ కేసులు 1,147 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంక్య 35,043కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 73 కోవిడ్ -19 మరణాలు నమోదయ్యాయి. రికవరీ రేటు 25.36 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది.
దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 10,498 కేసులు రికార్డయ్యాయి. తర్వాతి స్థానాన్ని గుజరాత్ ఆక్రమిస్తోంది. గుజరాత్ లో 4,395 నమోదయ్యాయి. ఢిల్లీ 3,439 కేసులతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటి వరకు దేశంలో 8889 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టవ్ కేసుల సంఖ్య 25007 ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. దీంతో ఆ ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా ప్రకటించారు.