Covid: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం చిన్నారుల కంటే పెద్ద‌ల‌పైనే అధికంగా ఉంద‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దేశంలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

Coronavirus illness: చైనాలో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టి ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. దీని క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వాలు అనేక చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు టీకాల‌ను సైతం అందుబాటులోకి తీసుకువ‌చ్చిన త‌ర్వాత కూడా దాని ప్ర‌భావం మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజుకూ త‌న రూపు మార్చుకుంటూ ప్ర‌మాద‌క‌ర వేరియంట్లుగా రూపాంత‌రం చెందుతోంది. ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. భార‌త్ లోనూ గ‌త కొంత కాలంగా త‌క్కువ‌గా న‌మోదైన కొత్త కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టంతో ఆందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం క‌రోనా ప్ర‌భావంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి క‌లుగ‌జేసే అనారోగ్య ప్ర‌భావం చిన్నారుల్లో కంటే పెద్ద‌ల్లోనే అధికంగా ఉంద‌ని తెలిపింది. 

కోవిడ్ పెద్దల కంటే పిల్లలలో తక్కువ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంద‌ని లోక్‌సభలో ప్రభుత్వం వెల్ల‌డించింది. దేశంలోని చిన్నారులు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారా? 12-18 ఏళ్లు, 5-12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రస్తుత స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు పవార్‌ సమాధానమిచ్చారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా తక్కువ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు లోక్‌సభకు తెలియజేసింది. ఓమిక్రాన్, దాని స‌బ్ వేరియంట్లను మొత్తం 7,362 నమూనాలలో కనుగొనబడ్డాయి. డెల్టా దాని స‌బ్ వేరియంట్లు 1 జనవరి 2022 నుండి జూలై 25, 2022 వరకు 0-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో INSACOG విశ్లేషించిన 118 నమూనాలలో కనుగొనబడ్డాయ‌ని కేంద్ర సహాయ మంత్రి ఆరోగ్య భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

దేశంలోని చిన్నారులు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారా? 12-18 ఏళ్లు, 5-12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రస్తుత స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు పవార్ పై వివ‌రాలు వెల్ల‌డించారు. "ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో SARS-CoV-2 ఇన్ఫెక్షన్లు సాధారణంగా పెద్దవారితో పోలిస్తే తక్కువ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి" అని పవార్ చెప్పారు. ఈ ఏడాది జూలై 26 నాటికి 12-18 ఏళ్లలోపు పిల్లలకు 9.96 కోట్ల మొదటి డోసులు (82.2 శాతం కవరేజీ), 7.79 కోట్ల రెండో డోసులు (64.3 శాతం కవరేజీ) అందించబడ్డాయ‌ని తెలిపారు. దేశంలో జాతీయ కోవిడ్ -19 టీకా కార్యక్రమం కింద 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న టీకాలు వేయడం ప్రారంభించలేదని, అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయడానికి తగినన్ని టీకా మోతాదులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. 

కాగా, దేశంలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 20 వేలకు పైగా కొత్త కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసులు 4,39,79,730కి చేరుకున్నాయి. మరణాలు 5,26,258కి పెరిగాయి.