Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఢిల్లీకి చేరుకున్న వుహాన్ లోని భారతీయులు

అక్కడ ఉన్న భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్రం ప్రత్యేకంగా ఓ ఎయిర్ ఇండియా విమానాన్ని వుహాన్ కి పంపింది. ఆ విమానంలో భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చారు.

Coronavirus: 6 Stopped As Air India Flies Back 324 Indians From China
Author
Hyderabad, First Published Feb 1, 2020, 9:51 AM IST

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు మందు కనిపెట్టలేకపోయిన ఈ వైరస్ రోజు రోజుకీ అన్ని దేశాలకు పాకేస్తోంది. ఈ క్రమంలో చైనాలోని వుహాన్ లో ఉన్న కొందరు భారతీయులు స్వదేశం రావడానికి నానా అవస్థలు పడ్డారు. తమను క్షేమంగా స్వదేశానికి పంపించండి అని వేడుకున్నారు.

కాగా... అక్కడ ఉన్న భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్రం ప్రత్యేకంగా ఓ ఎయిర్ ఇండియా విమానాన్ని వుహాన్ కి పంపింది. ఆ విమానంలో భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చారు.

Also Read కరోనా రోగుల శాడిజం... మిగితా వాళ్లకి కూడా వైరస్ సోకాలని.....

వుహాన్ ప్రావిన్స్ మొత్తంలో 600మందికి పైగా భారతీయులు ఉన్నారని... అందులో 400మంది స్వదేశానికి వస్తామని అభ్యర్థించారని అధికారులు చెబుతున్నారు. వీరిలో 324మందిని క్షేమంగా ఢిల్లీ చేర్చినట్లు వారు చెబుతున్నారు. మరికొంత మందిని తీసుకురావడానికి మరో రోజు మమరో వివానం వెళ్లనుంది.

శనివారం ఢిల్లీకి చేరుకున్న విమానంలో ఏపీకి చెందినన 56మంది ఇంజినీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్లు సమాచారం. కాగా వీరిందరికీ హరియాణాలోని మానేసర్ సమీపంలో భారత సైన్యం ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వారికి స్క్రీనింగ్ 2 దశల్లో జరగనుంది. తొలుత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని పరీక్షిస్తారు. అనంతరం మానేసర్ కేంద్రానికి తరలించి క్షున్నంగా పరీక్షలు నిర్వహిస్తారు.

వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు దాదాపు 200మంది ప్రణాలు కోల్పోయారు. 

ఇదిలా ఉండగా.. ఓ ఆరుగురు విద్యార్థులను మాత్రం విమానం నుంచి దింపేసినట్లు అధికారులు తెలిపారు వారంతా హైఫీవర్ తో బాధపడుతుండటంతో దింపేశామని అధికారులు చెప్పారు.  ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 జుంబో విమానంలో వూహాన్ నుంచి 350 మంది భారత విద్యార్థులను తరలించాలనుకున్నారు. ఆరుగురు భారత విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వూహాన్ విమానాశ్రయంలో చైనా ఇమిగ్రేషన్ అధికారులు వారిని విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. వూహాన్ నగరంలో మిగిలిపోయిన వారిని భారతదేశానికి తరలించేందుకు మరో ప్రత్యేక విమానం రప్పిస్తామని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios