అహ్మదాబాద్: కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

 కానిస్టేబుల్ ధావల్ రావల్ తల్లిదండ్రులతో పాటు సోదరుడికి పాటు సోదరుడికి కూడా కరోనా సోకింది. కరోనా సోకిన వీరంతా అహ్మదాబాద్ లోని తక్కరానగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

 తల్లిదండ్రుల పరిస్థితి క్షీణించడంతో ధావల్ వారిని సివిల్ ఆసుపత్రికి మార్చారు. దీంతో సోదరుడిని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధావల్ తల్లి ఈ నెల 14వ తేదీన మృతి చెందారు.

తల్లి మరణించిన రెండు రోజులకే తండ్రి  కూడా కరోనాతో చనిపోయారు.  వీరిద్దరూ మరణించిన తర్వాత సోదరుడు కూడ చనిపోయారు. అహ్మదాబాద్ నగరంలో కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనాను అరికట్టేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ లో 341 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47, 309కి చేరుకొన్నాయి. కరోనాతో 1968 మంది మరణించారు.