ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో పని చేసే వికలాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఢిల్లీలో (delhi) కరోనా కేసులు (corona casess) పెరుగుతున్నాయి. దేశంలోనే కరోనా కేసుల సంఖ్యలో ఢిల్లీ మొదటి వరుసలో ఉంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఆ రాష్ట్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగా ప‌లు ఆంక్ష‌లను అమ‌లు చేస్తోంది. గ‌త నెల‌లో వ‌చ్చిన క్రిస్మ‌స్, న్యూయ‌ర్ వేడుక‌ల‌ను నిషేధించింది. అలాగే నైట్ క‌ర్ఫ్యూను (night curfew) అమ‌లు చేస్తోంది. గ‌త రెండు వారాల నుంచి వీకెండ్ క‌ర్ఫ్యూ (weekend curfew) కూడా అమలు చేస్తోంది. 

క‌రోనా నుంచి ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లను ప్ర‌భుత్వం తీసుకుంటోంది. అందులో భాగంగానే మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసులు (government office), ఏజెన్సీల్లో (agency) ప‌ని చేసే విక‌లాంగ ఉద్యోగులు, గ‌ర్భిణీ ఉద్యోగుల‌కు హాజ‌రు నుంచి మిన‌హాంపు ఇచ్చింది. ఈ మేర‌కు ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ddma) ఉత్త‌ర్వులు జారీ చేసింది. వికలాంగులు, గర్భిణుల ఉద్యోగుల ఆరోగ్యం, భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వ శాఖ‌లు, పీఎస్ యూలు (psu), కార్పొరేషన్లు (corporations), స్వయంప్రతిపత్త సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వ స్థానిక సంస్థల కార్యాలయాల్లో సాధార‌ణ‌, అత్య‌వ‌స‌ర సేవల‌కు సంబంధించిన విధుల నుంచి మినహాయింపు ఉంటుంద‌ని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 

ఈ ఉద్యోగులు వారి మొబైల్ (mobile), ఈ-మెయిల్ (e-mail) ద్వారా వారి ఆఫీసుల‌తో రెగ్యుల‌ర్ గా ఇంటి నుంచి క‌మ్యూనికేష‌న్ (communication) క‌లిగి ఉంటార‌ని ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ (ddma) ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం కేవ‌లం సాధార‌ణ ఉద్యోగుల‌కు మాత్ర‌మే ప్ర‌త్యక్ష విధుల నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. కానీ తాజా ఉత్త‌ర్వుల ప్రకారం విక‌లాంగులు, గ‌ర్భిణుల‌కు అత్య‌వ‌స‌ర సేవ‌ల నుంచి కూడా మిన‌హాయింపు ఇచ్చింది. ఈ సేవ‌లు అందించే వారు కూడా ఇంటి నుంచి ప‌ని చేయ‌వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని ప్రైవేట్ ఆఫీసుల‌న్నీ(privet offices) వ‌ర్క్ ఫ్రం హోం (work from home) అమ‌లు చేయాల‌ని డీడీఎంఏ (ddma) ఆదేశించింది. అయితే కొన్ని అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే ఆఫీసుల‌కు మాత్ర‌మే వీటి నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుదల మొదలైనప్పటి నుంచి ప్రైవేట్ ఆఫీసులు (privet offices) 50 శాతం సిబ్బందితో ప‌ని చేస్తున్నాయి. 

గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 24,383 కోవిడ్-19 (covid -19) కొత్త కేసులు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 30.64 శాతంగా ఉంది. కొత్త కేసుల‌తో క‌లుపుకుంటే ఢిల్లీలో మొత్తం కేసులు 16,70,966కు చేరాయి. క‌రోనా వ‌ల్ల 34 మంది చ‌నిపోయారు. దీంతో క‌రోనా వైర‌స్ (corona virus) కార‌ణండా చ‌నిపోయిన వారి సంఖ్య 25,305కు చేరింది. ప్ర‌స్తుతం ఢిల్లీలో 92,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 15,53,388 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2.68 లక్షల కొత్త కోవిడ్ -19 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.