Asianet News TeluguAsianet News Telugu

corona virus : క‌రోనా వైర‌స్ వుహాన్ ల్యాల్ లో పుట్టిందా ? డ‌బ్లూహెచ్ వో శాస్త్ర‌వేత్త ఏమ‌న్నారంటే ?

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ? దాని మూలాలు ఏమిటి ? అసలు కరోనా వైరస్ మనల్ని విడిచి ఎప్పుడు వెళ్లిపోతుంది వంటి అనేక ప్రశ్నలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సమాధానాలు ఇచ్చారు. బ్లూమ్ బెర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక వివరాలు పంచుకున్నారు. 

corona virus: Was the corona virus born in Wuhan Lal? What does the WHW scientist say?
Author
Delhi, First Published Feb 11, 2022, 1:56 PM IST

 కరోనా (corona) మహమ్మారి ప్రపంచాన్నిరెండేళ్లుగా పట్టిపీడిస్తోంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో అన్ని దేశాలు చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాయి. కోవిడ్ (covid) వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ప‌త‌న‌మ‌య్యాయి. ఎంతో మంది ఉపాధి పొగొట్టుకున్నారు. మ‌రెంతో మంది త‌మ ఆత్మీయుల‌ను కోల్పొయారు. ఇప్పుడిప్పుడే ఈ మ‌హ‌మ్మారి కొంత త‌గ్గుముఖం ప‌డుతోంది. ఈ క‌రోనాను క‌ట్డడి చేసేందుకు మొద‌టి నుంచి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోంది. క‌రోనాను నియంత్రించ‌డానికి అన్ని దేశాల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తోంది. అయితే క‌రోనా విష‌యంలో అంద‌రిలో దాగి ఉన్న ఎన్నో సందేహాల నివృత్తి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (soumya swaminathan) ‘‘బ్లూమ్ బెర్గ్ (Bloomberg)’’ తో మాట్లాడారు. ‘‘ఎమ్మా బార్నెట్ మీట్స్’’ పేరుతో జరిగిన ఈ సంభాష‌ణ‌ల సారాంశాన్ని తెలుసుకుందాం.. 

బ్లూమ్‌బెర్గ్ : కరోనా వైరస్ మూలాలు ఏమిటి ? దాని గురించి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు ఏం తెలుసు ? 
స్వామినాథన్ : కొత్తగా ఉద్భవించిన దాదాపు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు జూనోటిక్ ఇన్ఫెక్షన్లే.  HIV నుంచి మొద‌లుకొని జికా, ఎబోలా, SARS, MERSతో పాటు మానవులకు సోకిన ఇతర రెండు ప్రధాన కరోనా వైరస్లు కూడా అలా వ‌చ్చిన‌వే. ఇవి జంతువు నుంచి ఉద్భవించినా వాహ‌కాల ద్వారా మ‌నుషుల‌కు సోకుతాయి. ఈ సందర్భంలో వాటి జన్యు శ్రేణులు ఇప్పటికీ మూలం వైపు చూపుతాయి. అయితే క‌రోనా వైర‌స్ కూడా గబ్బిలాల నుంచి. జంతువుల నుంచి మానవులకు ఎక్క‌డ, ఎప్పుడు, ఎలా సోకిందో మ‌న‌కు తెలియ‌లేదు. 

బ్లూమ్‌బెర్గ్ : క‌రోనా వ్యాపించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇప్పటికీ అస్పష్టంగా ఉండటం అసాధారణమేనా ?
స్వామినాథన్ : ఇది విచిత్రం కాదు. ఎందుకంటే గతంలో కూడా వైరస్‌ల మూలాన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. SARS సివెట్ పిల్లుల నుంచి వచ్చిందని, MERS ఒంటెల నుండి వ్యాపిస్తుందని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే HIV చింపాజీల నుంచి వచ్చిందని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.

బ్లూమ్ బెర్గ్ : చైనా (chaina)లోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందన్న వాద‌న‌ల‌పై మీరు ఏమంటారు ? 
స్వామినాథన్ :  దీనిపై ఏం చెప్పలేము. ఎందుకంటే ల్యాబ్ (lab) నుంచి లీకైంద‌న్న విష‌యంలో బ‌లమైన సాక్ష్యాన్ని ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. చైనాకు వెళ్ళిన శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఇది జంతువుల నుంచి వచ్చినట్లు ఎక్కువగా భావించారు. అది అడవి జంతువు కావ‌చ్చు లేదా పెంపుడు జంతువు కావ‌చ్చు లేదా ప‌క్షి, గ‌బ్బిలం కూడా కావ‌చ్చు. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. మేము డేటాను పూర్తిగా ప‌రిశీలించాలి. చైనాలో ఈ విష‌యంలో మ‌రిన్ని అధ్యయనాలు చేయాలి.

బ్లూమ్‌బెర్గ్ : WHOకి మరింత శక్తి అవసరమా?
స్వామినాథన్ : అవును. ముఖ్యంగా మహమ్మారికి వ్యాపించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను పరిశోధించడానికి శ‌క్తి అవ‌స‌రం. 194 సభ్య దేశాల్లోని ప్ర‌తీ ఒక్క‌రికీ  ప్రయోజనం చేకూర్చే పరిశోధనలు చేయడానికి WHOకి అధికారం ఇవ్వడానికి నియమాల సమితికి అంగీకారం తెలిపేందుకు కలిసి రావాలి. 

బ్లూమ్‌బెర్గ్ : మహమ్మారి ఎప్పుడు ముగుస్తుంది?
స్వామినాథన్ : దీనికి ఎవ‌రూ స‌రైన స‌మాధానం చెప్ప‌లేర‌ని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది చేస్తున్నట్టుగా మహమ్మారి ముగిసిందని ప్రకటించవద్దు. ఇంతకాలం మనం తీసుకుంటున్న జాగ్రత్తలన్నింటినీ వదులుకోవడం అవివేక‌మే అవుతుంది. మ‌నం దానిని ఇంకా కొన‌సాగించాల్సి ఉంది. అప్పుడే ఈ ఏడాది చివ‌రి నాటికి మ‌నం మంచి స్థాయిలో ఉంటాం. వేరియంట్ ఎక్కడైనా మ‌ళ్లీ పుట్ట‌వ‌చ్చు.ఈ స‌ర్కిల్ లో మ‌నం మొద‌టి  స్థాయికి తిరిగి వచ్చారు. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

బ్లూమ్‌బెర్గ్ : మహమ్మారి సమయంలో ప్రపంచ పెద్ద‌న్న‌గా  WHO మెరుగ్గా ప‌ని చేసిందా ?
స్వామినాథన్ : దీనిపై భిన్నఅభిప్రాయాలు ఉన్న‌ప్ప‌టికీ కొంత మెరుగ్గానే ప‌ని చేసింది. కానీ అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర ఆందోళ‌నక‌ర పరిస్థితిని ప్రకటించినప్పుడు  చైనా వెలుపల 100 కంటే తక్కువ కేసులు, కరోనాతో రెండు మరణాలు కూడా లేవు. ఈ విషయాన్ని చాలా కొద్ది దేశాలు దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. కొన్ని వారాల తర్వాత యూరప్‌లో, ఆ తర్వాత USలో అలా జ‌రుగుతుంద‌ని ఎవ‌రూ అనుకోలేరు. కానీ విలువైన స‌మ‌యం అప్పుడే దాటిపోయింది. 

బ్లూమ్‌బెర్గ్ : పేద దేశాలు త‌మ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించేందుకు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న స‌మ‌యంలోనే కొన్ని U.S, అనేక యూరోపియన్ దేశాలు వంటి సంపన్న దేశాలు వారి జనాభాకు అనేక వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండేలా చూసుకున్నాయి. ఈ విధానాల వ‌ల్లే కొన్ని కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ల ఆవిర్భావానికి దోహదపడ్డాయా?
స్వామినాథన్ : అవును. అది సాధ్య‌మే అని నేను చెప్ప‌గ‌ల‌ను. ఆఫ్రికాలో 85 శాతం మంది ప్రజల‌కు ఇప్ప‌టికీ త‌మ మొదటి డోస్‌ని అందుకోలేదు. ఇది కొత్త వేరియంట్‌లు పుట్టుకురావ‌డానికి కార‌ణం అవుతుంది. 

బ్లూమ్‌బెర్గ్ : మహమ్మారి తగ్గిన తర్వాత కూడా, భవిష్యత్తులో ప్రపంచం ఇంకా కరోనావైరస్‌తో పోరాడవలసి ఉంటుందా?
స్వామినాథన్ : ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే క‌రోనాతో మ‌నం ఎలా జీవించాలో నేర్చుకుంటాం. మేము ప్రపంచవ్యాప్తంగా మెరుగైన నిఘా వ్యవస్థలను కలిగి ఉంటాము. ఎవ‌రైనా సాధారణ శ్వాసకోశ వ్యాధుల‌తో లేదా ఫ్లూతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మాస్క్ ధరించ‌డం మంచిది. ఈ అల‌వాట‌ను భ‌విష్య‌త్తులో కూడా కొన‌సాగించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios