ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ గురువారం మీడియాతో వివరాలు వెళ్లడించారు.
కోవిడ్ -19 (covid -19) మనుషుల్ని వదలడం లేదు. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారీ ఇప్పటికీ మనల్ని విడిచిపెట్టి వెళ్లడం లేదు. తన రూపాన్ని మార్చుకుంటూ మన చుట్టే తిరుగుతోంది. ఇండియాలో కోవిడ్ -19 ప్రభావం 2020 మొదటి నుంచి కనిపించింది. కరోనా (corona)ను కట్టడి చేసి దేశ ప్రజలను కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కేసులు తగ్గిపోవడంతో దానిని తొలగించింది. మళ్లీ ఏడాది తరువాత అదే సమయంలో కరోనా విజృంభించింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంత కాలం పాటు లాక్ డౌన్ విధించారు.
రెండు వేవ్ లు దేశాన్ని కుదిపేసి వెళ్లిపోయాయి. ఇక కరోనా (corona) ఉండదు అని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈసారి ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో వెలుగు చూశాయి. అయితే దీని తీవ్రత తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. మళ్లీ ఈ వేరియంట్ లో కొత్త సబ్ వేరియంట్ (sub veriant) BA.2 వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడారు. “ఇప్పుడు భారతదేశంలోని BA.1 వేరియంట్‌తో పోల్చితే ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BA.2 ఎక్కువగా ఉంది. దేశంలో ఇంకా BA.3 సబ్ -వేరియంట్ ఇంకా గుర్తించలేదు. ఇంతకుముందు ప్రయాణికుల నుండి సేకరించిన నమూనాలలో BA.1 వేరియంట్ ప్రబలంగా ఉండేది. ఇప్పుడు కమ్యూనిటీ సెట్టింగ్‌లలో, BA.2 సబ్-వేరియంట్ క్రమంగా పెరుగుతోందని మేము కనుగొన్నాము’’ అని సుజీత్ కుమార్ సింగ్ చెప్పారు. ఇప్పటివరకు అందుకున్న మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికల ప్రకారం జనవరి నెలలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని సింగ్ చెప్పారు.మొత్తంగా అందిన నివేదికల వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్‌లో 1,292 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, డెల్టా కేసుల సంఖ్య 17,000కు పైగా ఉందని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకొని వారికి మరింత ప్రమాదం..
డెల్టా వేరియంట్ ఇంకా ఎటూ పోలేదని సుజీత్ కుమార్ సింగ్ (sujith kumar singh) ఉద్ఘాటించారు. కోవిడ్ మరణాల విషయంలో ఆయన మాట్లాడుతూ.. టీకాలు వేయని వేసుకోని ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కరోనా ముప్పు అధికంగా ఉందని అన్నారు. వారు హై-రిస్క్ (hi risk) జాబితాలో ఉన్నారని చెప్పారు. ‘‘ఢిల్లీలో మరణించిన వారిలో దాదాపు 64 శాతం మంది టీకాలు వేసుకోని కొమోర్బిడ్స్ ఉన్నారని చెప్పారు.
ఒమిక్రాన్ (omicron) వేరియంట్ BA.2 సబ్‌వేరియంట్ ఆసియా, ఐరోపాలో ముఖ్యంగా డెన్మార్క్ (denmark)లో ఆధిపత్యం చెలాయిస్తోంది. డానిష్ ఆరోగ్య మంత్రి మాగ్నస్ హ్యూనికే ప్రకారం.. ఇది చాలా సాధారణమైన BA.1 సబ్ వేరియంట్ కంటే చాలా తీవ్రంగా కనిపిస్తోందని అని అన్నారు. అయినప్పటికీ BA.2 ఎక్కువ మందికి సోకుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ప్రస్తుతం BA.1 వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 98% కేసులను కలిగి ఉంది.
