Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ : తల్లికి నెగటివ్.. పుట్టిన బిడ్డకు పాజిటివ్.. షాక్ లో డాక్టర్లు..

గర్భంతో ఉన్న మహిళలకు కరోనా సోకినా... ప్రసవం తర్వాత బిడ్డ లో వైరస్ లక్షణాలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి అని వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఉత్తర ప్రదేశ్ వారణాసిలో ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. తల్లికి వైరస్ లేకున్నా పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్ గా తేలడంతో వైద్యులు షాకయ్యారు.

corona virus : newborn baby tests positive in varanasi but mother is negative - bsb
Author
Hyderabad, First Published May 28, 2021, 1:34 PM IST

గర్భంతో ఉన్న మహిళలకు కరోనా సోకినా... ప్రసవం తర్వాత బిడ్డ లో వైరస్ లక్షణాలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి అని వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఉత్తర ప్రదేశ్ వారణాసిలో ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. తల్లికి వైరస్ లేకున్నా పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్ గా తేలడంతో వైద్యులు షాకయ్యారు.

వారణాసిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల మహిళ డెలివరీ కోసం మే 24న స్థానిక బనారస్ హిందూ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరింది. అప్పుడు వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా... కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది.  

ఆ తరువాత మే 25న ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన శిశువులో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరపగా... కరోనా పాజిటివ్ గా తేలింది.  దీంతో వైద్యులు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.

ఇది చాలా అసాధారణమైన ఘటన అని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ కెకె గుప్తా అన్నారు. కొన్నిసార్లు పరీక్షల్లో పొరబాట్లు చోటు చేసుకుంటే ఇలా జరగవచ్చని... తల్లికీ, బిడ్డకు మరోసారి కరోనా టెస్టులు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మహిళ, శిశువు ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios