Asianet News TeluguAsianet News Telugu

corona virus : కరోనా కలవరం.. మాజీ ప్రధాని దేవెగౌడకు కోవిడ్ - 19 పాజిటివ్

మాజీ ప్ర‌ధానమంత్రి, జ‌న‌తాదళ్ (సెక్యుల‌ర్) అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ‌ (HD Deve gouda) కు కూడా క‌రోనా పాజిటివ్ (corona possitive)  గా నిర్ధార‌ణ అయ్యింది. అయితే ఆయ‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌స్తుతం దేవెగౌడ ఆరోగ్యం నిల‌క‌డగానే ఉంది.

corona virus: Corona disturbance .. Former Prime Minister Deve Gowda Kovid - 19 positive
Author
Karnataka, First Published Jan 22, 2022, 1:49 PM IST

దేశంలో కరోనా ఉధృతి కొన‌సాగుతోంది. రోజు రోజుకు కోవిడ్ -19 (covid -19) కేసులు ఎక్కువ‌వుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి మూడేళ్లు అంద‌రినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇటీవ‌ల ప్ర‌ముఖులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. తాజాగా మాజీ ప్ర‌ధానమంత్రి, జ‌న‌తాదళ్ (సెక్యుల‌ర్) అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ‌ (HD Deve gouda) కు కూడా క‌రోనా పాజిటివ్ (corona possitive)  గా నిర్ధార‌ణ అయ్యింది. అయితే ఆయ‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌స్తుతం దేవెగౌడ ఆరోగ్యం నిల‌క‌డగానే ఉంది. ఈ మేర‌కు ఆయ‌న కార్యాల‌య సిబ్బంది మీడియాతో వివ‌రాలు వెల్ల‌డించారు. 

దౌవెగౌడ‌ కు క‌రోనా సోక‌డం ప‌ట్ల కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (bs yediyurappa) స్పందించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు. “సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ త్వరలో కరోనావైరస్ నుండి కోలుకోవాలని ఆశిస్తున్నాను” అని ఆయ‌న క‌న్న‌డ‌లో ట్వీట్  (tweet) చేశారు. హెచ్‌డీ దేవెగౌడ జూన్ 1996 నుంచి ఏప్రిల్ 1997 వరకు భారతదేశానికి 12వ ప్రధానమంత్రిగా పనిచేశారు. అతను గతంలో 1994 నుంచి 1996 వరకు కర్ణాటకకు 14వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు.

క‌రోనా సాధార‌ణ జ‌నాలతో పాటు ఎవరినీ విడిచి పెట్ట‌డం లేదు. ఇటీవ‌ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind keriwal) కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న‌కు కూడా ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. దీంతో కోవిడ్ -19 నిబంధల ప్ర‌కారం హోం ఐసోలేష‌న్ (home isolation) ఉన్నారు. త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చారు. అలాగే ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ కూడా క‌రోనా పాజిటివ్ గా తేలారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. త‌మ‌ను క‌లిసిన వారు కోవిడ్ -19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని మూడు రోజుల కింద‌ట లోకేష్ ట్విట‌ర్ లో తెలిపారు. తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు కూడా ఇటీవ‌ల సోకింది. చికిత్స కోసం ఆయ‌న హాస్పిట‌ల్ లో చేరారు. ఎవ‌రూ ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దని పెట్టుకోవ‌ద్ద‌ని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అంద‌రి ముందుకు వ‌స్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండ‌గా.. దేశంలో గ‌డిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,37,704 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల సంఖ్య పదివేలు దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 488తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,88,884కి చేరింది. గత 24 గంటల్లో 2,42,676 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్ర‌తీ ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని, విధిగా మాస్కు ధ‌రించాల‌ని, భౌతికదూరం పాటించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios