Asianet News TeluguAsianet News Telugu

ఇండియాపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 2,553 కేసులు, మొత్తం 42,553కి చేరిక

 గత 24 గంటల్లో 2553 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కి చేరుకొందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో 1,074 మంది కరోనా నుండి కోలుకొన్నారని  కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

corona virus: 1,074 Patients Cured in 24 Hours, India Logs Recovery Rate of 27.52%
Author
New Delhi, First Published May 4, 2020, 4:49 PM IST


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 2553 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కి చేరుకొందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో 1,074 మంది కరోనా నుండి కోలుకొన్నారని  కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

సోమవారం నాడు న్యూఢిల్లీలో ఆయన  మీడియాతో మాట్లాడారు. గత 24 గంటల్లో  కరోనాతో 73 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 1373 మంది మరణించారని లవ్ అగర్వాల్ చెప్పారు.దేశంలో కరోనా సోకిన రోగుల రికవరీ రేటు  27.52కు పెరిగిందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,453గా ఉందని కేంద్రం తెలిపింది. బెంగాల్ లో అధికంగా ఈ వైరస్ కారణంగా మరణించారని ఆయన తెలిపారు.

జోన్ల వారీగా లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెడ్ జోన్లు,కంటైన్మెంట్లలో ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.  ఒకరు నిర్వహించుకొనే వ్యాపారసంస్థలను తెరుచుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.ఆంక్షలను సడలించిన ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ ను పాటించకపోతే  కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలోని 112 జిల్లాల్లో 610 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి జాతీయ స్థాయి సగటు కంటే 2 శాతం తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో ఏప్రిల్ 21 తర్వాత మొదటి కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

సరుకుల రవాణాకు సంబంధించి ఇంటర్ స్టేట్స్ మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని కేంద్రం కోరింది. అవసరమైతే 1930, జాతీయ హెల్ప్ లైన్ 1033కు ఫోన్ చేయాలని కేంద్రం సూచించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios