ఆప్ పై కరోనాపంజా: ఎమ్మెల్యే, కార్యదర్శికి పాజిటివ్, లక్షణాలతో ఆసుపత్రిలో మంత్రి

ఇప్పటికే ఢిల్లీ ఆరోగ్య మంత్రి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆయనకు నిన్న కరోనా వైరస్ పరీక్ష చేస్తే నెగటివ్ వచ్చింది. జ్వరం ఉండడంతో ఆయనకు నేడు మరోసారి టెస్ట్ చేసారు. ఇకపోతే ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే  ఆతిషి, కార్యదర్శి అక్షయ్ మరాఠేలు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.

Corona Terror In AAP: Atishi,Akshay Marathe Tests Positive, Satyendra jain Tested Again

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తూ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీ ఆరోగ్య మంత్రి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆయనకు నిన్న కరోనా వైరస్ పరీక్ష చేస్తే నెగటివ్ వచ్చింది. జ్వరం ఉండడంతో ఆయనకు నేడు మరోసారి టెస్ట్ చేసారు. 

ఇకపోతే ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే  ఆతిషి, కార్యదర్శి అక్షయ్ మరాఠేలు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. చూడబోయ్హఉంటే... ఆమాద్మీ పార్టీ పై కరోనా వైరస్ పగబట్టినట్టుగా ఉంది. 

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మూడున్నర లక్షలు దాటేశాయి. ఈ వార్త దేశ ప్రజలను మరింత కలవరపెడుతోంది.

గత 24గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా 12వేలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 3,54,065మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. కాగా.. 11,903 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. రికవరీ రేటు మాత్రం 52.79శాతం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

దేశంలో కరోనాబారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.79 శాతంగా వుంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ పైపైకి దూసుకెళ్తోంది. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. 

పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో వుంది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీల గుజరాత్, మధ్యప్రదేశ్ లలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలోను కరోనా తీవ్ర ప్రతాపం చూపుతుంది.

ఇదిలా ఉండగా..ప్రపంచ కరోనా పరిస్థితులపై అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జూలై 15 నాటికి భారత్ లో కరోనా తీవ్రస్థాయికి చేరుతుందని, అప్పటికి 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.  అప్పటికి కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్ దే అవుతుందని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios