బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని.. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేసుకోవాలనా నడ్డా సూచించారు. కొన్నిరోజులు ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టనున్నట్లు నడ్డా ప్రకటించారు. బెంగాల్ పర్యటనలో వున్న ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చారు.