Asianet News TeluguAsianet News Telugu

గేదె మాంసంలో కరోనా మూలాలు: భారత కంటైనర్లను తిప్పికొట్టిన కాంబోడియా

ఒక ప్రైవేట్ సంస్థ రవాణా చేసిన ఐదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేశామని అధికారులు చెప్పారు. 

Corona in Indian  Buffalo meat
Author
Hyderabad, First Published Jul 28, 2021, 7:36 AM IST

ఇప్పటి వరకు కేవలం మనుషులకు మాత్రమే ఈ కరోనా మహమ్మారి సోకుతుందని మనమంతా అనుకున్నాం. కానీ.. జంతువుల్లోనూ ఈ కరోనా ప్రభావం ఉంటుందోని తాజాగా తెలుస్తోంది.  భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చిన మాంసం కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు తెలిపడం గమనార్హం.

ఇందులో భాగంగా ఒక ప్రైవేట్ సంస్థ రవాణా చేసిన ఐదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేశామని అధికారులు చెప్పారు. ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ దిగుమతులను అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం భారత్ నుంచి వచ్చిన గేదె మాంసం కంటైనర్లలో కరోనా వైరస్ మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios