కరోనా సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్లింది ఓ బాలిక. అయితే అక్కడ ఉన్నన్ని రోజులు బాలిక మేనమామ ఆమెపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తరువాత అనారోగ్యానికి గురవడంతో హాస్పిటల్ కు వెళ్లింది. బాలిక గర్భం దాల్చిందని తేలడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.
గతేడాది చివరల్లో కరోనా (corona) కేసులు పెరుగుతుండటంతో స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్లో ఆ బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాలనుకుంది. అనుకున్నట్టుగానే అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అయితే ఆ సమయంలో ఆ బాలికపై సొంత మేనమామ కన్నుపడింది. సెలవుల్లో ఆ బాలిక అక్కడ ఉన్న రోజుల్లో ఆమెపై సార్లు పలు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని ఎవరికీ చెప్పవద్దని ఆ బాలికను బెదిరించాడు. అయితే ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోయంబత్తూరు (Coimbatore) కు చెందిన 15 ఏళ్ల బాలిక గత ఏడాది చివర్ల కరోనా కారణంగా స్కూల్స్ (schools) మూసేయడంతో మధురై (Madurai) లోని తన అమ్మమ్మ ఇంటి వెళ్లింది. ఆ సెలవు సమయంలో బాలిక మేనమామ (33) ఆమై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. దీంతో ఆమె బయపడి ఎవరికీ చెప్పలేదు.
అయితే కరోనా (corona) కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి (February)లో స్కూల్స్ తెరిచారు. దీంతో ఆ బాలిక తిరిగి వాళ్ల ఇంటికి వచ్చింది. అయితే ఓ రోజు బాలిక అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమెను డాక్టర్ (doctor) వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బాలిక గర్భంతో ఉందని తెలిపింది. దీంతో ఆ బాలికను ఏం జరిగిందని విచారించగా అసలు విషయం తెలిపింది.
తరువాత ఆ బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా శుక్రవారం మేలూరులోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టంలోని సెక్షన్ 5(l) (n) J(ii) r/w 6 కింద కేసు నమోదు చేసింది. అయితే నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో తమిళనాడు (Tamil Nadu)లోని విలుప్పురం (Viluppuram)జిల్లాలో మైనర్ బాలికపై ఆమె తండ్రి, అతని స్నేహితుడు అత్యాచారం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 44 ఏళ్ల నిందితుడు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. దీంతో తన 17 ఏళ్ల కూతురుతో కలిసి జీవిస్తున్నాడు. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న పని చేస్తున్న అతడు సొంత కూతురు అని కూడా చూడకుండా రెండేళ్లుగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడితో పాటు 46 ఏళ్ల మరో తాపీ మేస్త్రీ కూడా ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారం చేశాడు.
దీనిని బాధితురాలి బంధువులు, చుట్టుపక్కల వారు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన లైంగిక దాడిని ఆ మైనర్ బంధువులకు వివరించింది. వారు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
