Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : 55వేలకు దిగువకు కరోనా కేసులు, 30 కోట్లు దాటిన టీకాలు..

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. తాజాగా 18,59,469 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 54,069 మందికి పాజిటివ్ గా తేలింది. వరుసగా రెండో రోజు కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,00,82,778కి చేరగా.. 3,91,981 మరణాలు సంభవించాయని గురవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

corona cases update in india, vaccination process reached a mile stone - bsb
Author
Hyderabad, First Published Jun 24, 2021, 10:39 AM IST

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. తాజాగా 18,59,469 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 54,069 మందికి పాజిటివ్ గా తేలింది. వరుసగా రెండో రోజు కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,00,82,778కి చేరగా.. 3,91,981 మరణాలు సంభవించాయని గురవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ప్రస్తుతం క్రియాశీల కేసులు 6.27 లక్షలకు తగ్గాయి. ఆ రేటు 2 శాతానికి సమీపంలో ఉంది. నిన్న 68,885 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,90,63,740 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగింది. 

టీకా డోసులు పంపిణీ వేగవంతం అయ్యింది. దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో ఇటీవల కాస్త వేగం కనిపిస్తోంది. జూన్ 23 నాటికి 30.16కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. నిన్న ఒక్కరోజే 64,89,599 మంది టీకాలు వేయించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios