ముంబాయిలో పీక్ స్టేజ్ కు చేరుకున్న కరోనా కేసులు - వెల్లడించిన కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ డాక్టర్
ముంబాయిలో కరోనా కేసులు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయని మహారాష్ట్ర కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. త్వరలోనే కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయని ఆయన అంచనా వేశారు.
మహారాష్ట్రలో (maharastra) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా కోవిడ్ -19 (covid -19 ) కేసుల నమోదులో మహారాష్ట్ర, ఢిల్లీ (delhi)లు ముందంజలో ఉన్నాయి. కోవిడ్ కట్టడి కోసం ఆ రెండు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ (night curfew), వీకెండ్ కర్ఫ్యూలు (weekend curfew) విధిస్తున్నాయి. గత నెలలో వచ్చిన క్రిస్మస్, న్యూయర్ వేడుకలను కూడా నిషేదించాయి. ఇలా కరోనా నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి.
మహారాష్ట్రలోని ముంబాయి (mumbai) పట్టణంలోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముంబాయి రాష్ట్ర రాజధాని అవడం, వ్యాపార కార్యాకలపాలు ఎక్కువగా సాగడం వల్ల ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఇక్కడ కేసులు వేగంగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఆ పట్టణంలో పీక్ స్టేజ్ కు పెరిగాయని, యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని మహారాష్ట్ర కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ లో (covid -19 taskforce) సభ్యుడైన ఓ డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. శనివారం ముంబాయిలో ఒక్క రోజే 10,661 కోవిడ్ -19 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది మృతి చెందారు. గతేడాది జూలై 29 తరువాత ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారు. ఈ హెల్త్ బులిటెన్ వెలువడిన తరువాత డాక్టర్ శశాంక్ జోషి ఈ ప్రకటన చేశారు. దాదాపుగా ముంబాయిలో కరోనా కేసులు పీక్ స్టేజ్ (peek stage)కు చేరుకున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైందని అన్నారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42,462 కోవిడ్ -19 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం నాడు రాష్ట్రంలో 43,211 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక రోజు వ్యవధిలో కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బీఎంసీ (bmc) డేటా ప్రకారం కూడా మూడు రోజులుగా కొత్తగా సోకిన రోగుల సంఖ్య తగ్గుతోంది. ముంబాయిలో ఒక్క రోజే 10, 661 కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ అందులో 722 మంది మాత్రమే హాస్పిటల్స్ (hospitals) లో చేరారు. దీంతో ఇప్పటి వరకు హాస్పిటల్ లో చేరిన కోవిడ్ -19 (COVID-19) రోగుల సంఖ్యను 5,962 కు పెరిగింది.
ముంబాయిలో నగరంలో కోవిడ్ -19 పేషెంట్ల కోసం 38,117 హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందలో ఇప్పటి వరకు 15.7 శాతం బెడ్స్ మాత్రమే పేషెంట్లతో నిండిపోయాయి. ప్రస్తుతం ముంబాయిలో రికవరీ రేటు (ricovery rate) 91 శాతంగా ఉంది. నగరంలో కోవిడ్ -19 కేసుల కారణంగా బీఎంసీ 58 బిల్డింగ్ లను మూసివేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో కూడా కరోనా కేసులు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ (delhi health minister satyendar jain) శనివారం ప్రకటించారు. రోజు వారి కేసులు 15,000కి తగ్గినప్పుడు ఆంక్షలను సడలింపు విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు.