దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 13,823 మందికి కోరోనా నిర్ధారణ అయ్యాయి. కాగా కరోనాతో 162 మంది మరణించారు. 

దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కోటి 05 లక్షల 95వేల 660 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.  కాగా.. 1 లక్షా 52 వేల 718 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,97,201 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స నుంచి కోలుకుని 1,02,45,741 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.66 శాతం ఉండగా..మరణాల రేటు 1.44 శాతానికి తగ్గిందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.