Asianet News TeluguAsianet News Telugu

కరోనా: హోం ఐసోలేషన్ గైడ్‌లైన్స్ ల్లో మార్పులు....

హోం ఐసోలేషన్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
 

corona cases: Centre eases home isolation rules
Author
New Delhi, First Published Jul 3, 2020, 12:36 PM IST

న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం నాడు  మార్గదర్శకాలను జారీ చేసింది.

దేశంలో కరోనా రోగులు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. హెచ్ఐవీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగులు హోం ఐసోలేషన్ లో ఉండడానికి నిరాకరించారు. వృద్ధులు, చిన్నపిల్లల ఐసోలేషన్ చేయడానికి డాక్టర్ల అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. 

also read:రెమిడెసివిర్ డ్రగ్: ఇండియాలో తయారీకి మైలాన్ ల్యాబ్ కు అనుమతి

వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేని రోగులను ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ చేస్తారు. హోం ఐసోలేషన్ లో ఉంచుతారు. హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులు ఇంట్లో ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులకు 24 గంటల పాటు సంరక్షకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం కోరింది.  హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులు, సంరక్షకులు వారితో సన్నిహితంగా మెలిగినవారు హైడ్రాక్సిక్లోరోక్విన్ మందులను ఉపయోగించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.


లివర్, గుండె,డయాబెటిక్, బీపీ ఉన్నవారంతా వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొంది.ఆరోగ్య సేతు యాప్ ద్వారా హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులు ఎప్పటికప్పుడు పరీక్షించుకొని స్థానికంగా ఉన్న వైద్యాధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios