Asianet News TeluguAsianet News Telugu

దేశంలో కరోనా కేసులో పెరుగుతున్నాయ్.. అయినా ఆందోళన అవసరం లేదు - కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ..

దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. అయినప్పటికీ హాస్పిటల్ లో చేరికలు పెరగడం లేదని చెప్పారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందకుండా, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

Corona cases are increasing in the country.. but there is no need to worry - Union Health Minister Mansukh Mandaviya..ISR
Author
First Published Apr 3, 2023, 3:22 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని, కానీ హాస్పిటల్ లో చేరికలు పెరగడం లేదని తెలిపారు. దేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై మన్సుఖ్ మాండవీయ సోమవారం మాట్లాడారు. కరోనా విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఈ నెల 17 వరకు జ్యుడిషీయల్ కస్టడీ పొడిగింపు

కాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం అప్డేట్ చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో భారతదేశంలో 3,641 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,892కు పెరిగింది.

దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 6.12 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా నమోదైంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,26,246)గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు ఇప్పుడు 0.05 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది.

కొత్త పార్లమెంట్ భవనం గ్రాండ్ ఎంట్రెన్స్ దగ్గర ప్రధాని డిగ్రీ ప్రదర్శించాలి - ఎంపీ సంజయ్ రౌత్

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి. ఇదిలా ఉండగా.. ఆదివారం కూడా దేశంలో ఒకే రోజు 3,824 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి. ఇవి గడిచిన ఆరు నెలల్లోనే అత్యధికం. కాగా.. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల కేసుల సంఖ్య 20,219 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 కోసం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదని పేర్కొంది. కోవిడ్ -19 ఇతర స్థానిక అంటువ్యాధులతో సంక్రమించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios