ఢిల్లీలో అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న కేసుల దృష్గ్యా ఈ రోజు రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 5 గంటలవరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోంది. ఆక్సీజన్ కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకున్నాయి. కష్టమైనా లాక్ డౌన్ విధించాల్సి వస్తోంది. వలస కార్మికులు ఇక్కడే ఉండండి. 

అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో 35వేల కేసులు. పాజిటివ్ రేటు పెరిగింది. 

ఈ నేపత్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ విషయాలు భయపెట్టడానికి చెప్పడం లేదని ప్రజలందరూ ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు. ఆరు రోజుల తరువాత లాక్ డౌన్ పొడగించే పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. 

రోజుకు లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని.. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.