సారాంశం
Coromandel Express Accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తి చేశారు. ప్రభుత్వం ఒక్కరోజు సంతాప దినంగా ప్రకటించింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర మంత్రులు ఒడిశాకు బయలుదేరారు. చెన్నైలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో తమిళనాడు సీఎం స్టాలిన్ పరిస్థితిని సమీక్షించారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన రాష్ట్రంలోని తమిళుల కోసం ఆసుపత్రి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని తమిళనాడు మంత్రి ఉదయనిధి తెలిపారు.
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. సహాయక చర్యల్లో రాష్ట్ర, కేంద్ర బలగాలు, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిన ఘోర రైలు పట్టాలు తప్పిన ఘటనలో 288 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారని ప్రస్తుతం అందుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి. రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం ఒక రోజు సంతాప దినాలను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తి చేశారు. ప్రభుత్వం ఒక్కరోజు సంతాప దినంగా ప్రకటించారు. సహాయక చర్యల కోసం రాష్ట్ర మంత్రులు ఒడిశాకు చేరుకున్నారు. చెన్నైలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో తమిళనాడు సీఎం స్టాలిన్ పరిస్థితిని సమీక్షించారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన రాష్ట్రంలోని తమిళుల కోసం ఆసుపత్రి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని తమిళనాడు మంత్రి ఉదయనిధి తెలిపారు.
ఒడిశాలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మంది గాయపడిన కోరమండల్ రైలు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తంచేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక రోజు సంతాప దినాలు ప్రకటించారు. చెన్నైలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో పరిస్థితిని సీఎం సమీక్షించారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా శనివారం జరగాల్సిన కార్యక్రమాలను కూడా డీఎంకే రద్దు చేసింది. చెన్నైలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పరిస్థితిని సమీక్షించారు. ఉదయనిధి స్టాలిన్, శివ శంకర్, అన్బిల్ మహేష్ సహా తమిళనాడు మంత్రులు శనివారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం మంత్రులంతా ఒడిశాకు పయనమవుతున్నారు.
విమానాశ్రయంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. 'రైలు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు అక్కడికి వెళ్తున్నాం. ఒడిశా సీఎంతో తమిళనాడు సీఎం మాట్లాడారు. స్పాట్ కు చేరుకున్న తర్వాత మీకు అప్ డేట్ చేస్తాం. రైలు ప్రమాదానికి గురైన తమిళనాడులోని తమిళుల కోసం ఆసుపత్రి సౌకర్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయని' తెలిపారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా జరగాల్సిన కార్యక్రమాలను డీఎంకే రద్దు చేసింది. రైలు ప్రమాదం నేపథ్యంలో మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా రాష్ట్రంలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. #BalasoreTrainAccident ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా ఈ కార్యక్రమాలను రద్దు చేశారు. కలైంజ్ఞర్ విగ్రహానికి, కలైంజ్ఞర్ మెమోరియల్ కు సీఎం ఎంకే స్టాలిన్ మాత్రమే నివాళులు అర్పిస్తారనీ, మిగిలిన అన్ని బహిరంగ సభలు, కార్యక్రమాలు రద్దయ్యాయని తెలిపారు. అలాగే, శనివారం సాయంత్రం జరగాల్సిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ నేతల బహిరంగ సభను మరో తేదీకి వాయిదా వేశామనీ, తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.