Asianet News TeluguAsianet News Telugu

పాఠశాలను లిక్కర్ గోదాముగా మార్చిన స్మగ్లర్లు.. 140 కాటన్ల అక్రమ మద్యం సీజ్.. ఎక్కడంటే..?

బీహార్‌లోని వైశాలిలోని ప్రభుత్వ పాఠశాలలో 140 కాటన్ల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు అందించిన సమాచారం మేరకు పాఠశాలలో సోదాలు నిర్వహించగా.. భారీ మొత్తంలో విదేశీ మద్యం బయటపడిందని ఇన్‌స్పెక్టర్ బ్రిజేష్ సింగ్ తెలిపారు.

Cops seize 140 cartons of alcohol from school in Vaishali district
Author
First Published Sep 22, 2022, 5:12 AM IST

భావిభారత పౌరుల భవిత్యం రూపొందే పాఠశాలను విదేశీ మద్యాన్ని నిల్వ ఉంచే గోదాముగా మార్చింది  ఓ లిక్కర్ మాఫియా.. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఓ తరగతి నుంచి దాదాపు 140 కాటన్ల మద్యాన్ని  స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల వివరాల ప్రకారం..బీహార్ లోని వైశాలి జిల్లాలోని లాల్​గంజ్​ పోలీస్ స్టేషన్​ పరిధికి చెందిన బృందావన్​​ గ్రామంలో ఉన్న రామరాతి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో లిక్కర్ మాఫియా.. అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యాన్ని నిల్వ ఉంచింది. రాత్రిరాత్రే.. ఆ అక్రమార్కులు పాఠశాల లోని ఓ తరగతి గది తాళాలను పగలగొట్టి.. అందులో వారి విదేశీ మద్యాన్ని అందులో డంప్ చేసి.. తమ కొత్త తాళాన్ని వేశారు స్మగ్లర్లు. 

అయితే.. పాఠశాల సిబ్బంది.. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే.. సరికి కొత్త తాళం వేసి ఉండటం గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయడికి సమాచారం అందించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు ఘటన స్థలాన్ని పరిశీలించి.. స్థానిక ప్రజా ప్రతినిధులను పాఠశాలకు పిలిపించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. 

అనంతరం లాల్​గంజ్​ పోలీసులకు విషయాన్ని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని తాళం పగలగొట్టి చూడగా గదిలో భారీగా మద్యం నిల్వ ఉంది. దీంతో వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాన్​లో స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఓ పాఠశాల నుంచి ఇంత భారీగా మద్యం తరలిపోవడంతో పోలీసుల నుంచి ప్రజల వరకు అందరూ ఉలిక్కిపడ్డారు. 140 కార్టన్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలోని ఒక గది తాళం పగులగొట్టి ఉన్నట్టు.. ఆ స్థానంలో కొత్త తాళం అమర్చినట్టు తనుకు బుధవారం ఉదయం తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. అనంతరం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు స్థానిక ప్రజాప్రతినిధులను పిలిపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ బ్రిజేష్ సింగ్, పోలీసులు 140 కార్టన్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే.. తరగతి గది తాళం పగులగొట్టి మద్యం అందులో ఎవరూ పెట్టారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios