లాక్ డౌన్ ఎఫెక్ట్: కటింగ్ చేయడం కూడా మొదలుపెట్టిన పోలీసులు, వీడియో వైరల్
రాజస్థాన్ కు చెందిన ఒక కానిస్టేబుల్, తన సహచరుడికి కటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ నాగోరి గేట్ కు చెందిన సదరు కానిస్టేబుల్ జుట్టు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాడు.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడడానికి ప్రపంచం వద్ద ఎటువంటి ఆయుధం లేదు. కేవలం లాక్ డౌన్ లో తల దాచుకుంటూ ఆ వైరస్ నుంచి తప్పించుకుంటోంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలు చూపిన బాటలోనే పయనిస్తూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ లాక్ డౌన్ వల్ల బయట సమస్తం బంద్ అయిపోయాయి. అత్యవసర సేవలు మినహా వేరే వెతికి కూడా అనుమతులు ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇలా అన్ని సేవలు నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా అన్ని పనులను సొంతగా చేసుకోవడం మొదలుపెట్టారు.
తాజాగా రాజస్థాన్ కు చెందిన ఒక కానిస్టేబుల్, తన సహచరుడికి కటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ నాగోరి గేట్ కు చెందిన సదరు కానిస్టేబుల్ జుట్టు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాడు.
జుట్టును కట్ చేయించుకుందామంటే కటింగ్ షొపులు మూసి ఉన్నాయి. ఈ దెబ్బకు పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ కత్తెర దువ్వెన అందుకొని కటింగ్ మొదలెట్టేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో పై నాగోరి గేట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్పందిస్తూ జబ్బార్ సింగ్ .... ప్రతీ సమస్యకు పరిష్కారం ఉందని జబ్బార్ సింగ్ తెలిపారు.
ఇకపోతే....కరోనా వైరస్ పై ముందు వరసలో నిలబడి డాక్టర్లతో సహా పోరాడుతున్న పోలీసులకు సైతం కరోనా సోకుతుంది. తాజాగా తమిళనాడులో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు నగరానికి సమీపంలో ఉన్న పొదనూర్, కునియాముత్తూర్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా సోకడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా రెండు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.
వీరితో పాటు విధులు నిర్వర్తించిన 105 మంది పోలీస్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ వచ్చిందని నగర పోలీస్ కమీషనర్ ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన పోలీసులకు కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. శనివారం రాష్ట్రంలో 66 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,821కి చేరింది. వీరిలో దాదాపు 900 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు.
ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. మే 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగుస్తుంది.