దేశవ్యాప్తంగా ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. అయితే మనుషులకే కాదు... దేవుడికి కూడ ఎండ వేడిమిని తట్టుకోనేందుకు వీలుగా ఆలయంలో ఏసీలు, కూలర్లు పెట్టారు.
కాన్పూర్: దేశవ్యాప్తంగా ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. అయితే మనుషులకే కాదు... దేవుడికి కూడ ఎండ వేడిమిని తట్టుకోనేందుకు వీలుగా ఆలయంలో ఏసీలు, కూలర్లు పెట్టారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని సిద్ది వినాయక గణేష్ ఆలయంలో వినాయకుడికి ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు ఎండ వేడిమిని మనుషులే భరించలేకపోతున్నారు. దేవుడికి కూడ ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్టు స్థానికులు చెప్పారు.
దేవుళ్లు కూడ మనుషుల మాదిరిగానే ఉన్నాయని... అందుకే కూలర్లను ఏర్పాటు చేశామని స్థానిక దేవాలయ కమిటీ నేతలు చెప్పారు. వాతావరణానికి అనుగుణంగా వినాయకుడికి పలుచటి దుస్తులు ధరింపజేశారు.
