Asianet News TeluguAsianet News Telugu

పఠాన్ పై కొనసాగుతున్న వివాదం.. బీహార్ లో సినిమా హాళ్ల ఎదుట పోస్టర్లు దహనం..

బీహార్ లో పఠాన్ సినిమాను వ్యతిరేకిస్తూ హిందూ సంస్థల సభ్యులు ఆందోళన చేపట్టారు. సినిమా హాళ్ల వెలుపల ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను తగులబెట్టారు. కొంత కాలం నుంచి వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా నేడు విడుదల కానుంది. 

Controversy over Pathan. Posters burnt in front of cinema halls in Bihar..
Author
First Published Jan 25, 2023, 10:30 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’పై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. బీహార్‌లో విడుదలకు ముందే హిందూ సంస్థల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సినిమా హాళ్ల ఎదుట గందరగోళం సృష్టించారు. ఆందోళనలు చేశారు. భాగల్‌పూర్‌లోని ఓ సినిమా హాలు వెలుపల ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను దహనం చేశారు. సినిమాను ప్రదర్శిస్తే సినిమా హాలును తగలబెడతామని హెచ్చరిస్తూ నినాదాలు చేశారు.

హిందుత్వవాదంతో రాజీపడబోమని 'ఫిల్మ్ చలేగా హాల్ జలేగా' అంటూ నినదించారు. భాగల్‌పూర్‌లోని ఏదైనా థియేటర్లలో 'పఠాన్' ప్రదర్శిస్తే, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని హిందూ సంస్థల సభ్యులు నివేదించారు. షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’పై రైట్-వింగ్ కార్యకర్త సత్యరంజన్ బోరా సోమవారం గీతానగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 

‘బేషరమ్ రంగ్’ పాట విడుదలైన తర్వాత పఠాన్ సినిమా వివాదంలో పడింది. ఆ సాంగ్ లో దీపికా పదుకొణె ధరించిన కాషాయ దుస్తులు, అలాగే పాటలోని లిరిక్స్‌పై పలువురు హిందూ సంస్థలు, బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను కించపరిచే, దెబ్బతీసే ప్రయత్నమని వారు పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాతలు కాషాయ రంగును ‘బేషరం రింగ్’ అని అభివర్ణించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అనే రెండు హిందూ సంస్థలు ప్రధాన సంస్థలు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ, విడుదలపై నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) సవరణలతో తాము సంతృప్తి చెందామని, కాబట్టి గుజరాత్ లో విడుదలను తాము వ్యతిరేకించబోమని మంగళవారం ప్రకటించారు. 

నాలుగు సంవత్సరాల విరామం తర్వాత షారుక్ ఖాన్ నటించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ జనవరి 25వ తేదీన పఠాన్  4.19 లక్షల టిక్కెట్లను విక్రయించగా, వార్ డే 1 విక్రయాలు దాదాపు 4.10 లక్షలకు చేరుకున్నాయి. 6.50 లక్షల టిక్కెట్‌ విక్రయాలతో ప్రభాస్‌ నటించిన బాహుబలి 2 ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.

'పఠాన్' జనవరి 25న విడుదల కానుంది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత SRK మళ్లీ తెరపైకి వస్తున్న చిత్రం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఇందులో దీపికా పదుకొనే మరియు జాన్ అబ్రహం కూడా నటించారు. జనవరి 25వ తేదీ కోసం ముందస్తుగా 4.19 లక్షల టిక్కెట్లను విక్రయించగా.. అందులో దాదాపు 4.10 లక్షల అమ్మకాలు జరిగాయి. కాగా.. ఇలా 6.50 లక్షల టిక్కెట్‌ విక్రయాలతో ప్రభాస్‌ నటించిన బాహుబలి 2 ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios