ప్రజా జీవితంలో వున్న వారు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఏమాత్రం తేడాగా మాట్లాడినా ప్రత్యర్ధి పార్టీలు, ప్రజలు, మీడియా దుమ్మెత్తిపోస్తారు.

తాజాగా కల్లు కరోనా వైరస్‌ను నిరోధిస్తుందంటూ బహుజన సమాజ్ పార్టీ యూపీ విభాగం అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్  చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

కల్లుకు రోగనిరోధకశక్తి ఉందని, ఇది చుక్క గంగానది నీటి కంటే స్వచ్ఛమైనదని ఆయన పేర్కొన్నారు. కల్లు ఎక్కువగా తాగితే కరోనా రాదని ఆయన వ్యాఖ్యానించారు.

బల్లియా జిల్లా రాస్రా ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్ భర్ మాట్లాడారు. ప్రజలు ఎక్కువగా కల్లు తాగితే వారు కొవిడ్ -19 బారిన పడరని ఆయన సలహా ఇచ్చారు. రాజ్ భర్ సమాజంలో పిల్లలు కల్లు తాగుతారని ఆయన వివరించారు.