వినియోగదారుల హక్కులు ప్రాణానికి, ఆస్తికి భద్రతను కల్పిస్తాయి. వస్తువులు, సేవల నాణ్యత, పరిమాణం, ధర గురించి తెలుసుకోవడానికి, ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి వినియోగదారులకు హక్కు ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వినియోగదారుల హక్కులు ప్రాణానికి, ఆస్తికి భద్రతను కల్పిస్తాయి. వస్తువులు, సేవల నాణ్యత, పరిమాణం, ధర గురించి తెలుసుకోవడానికి, ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి వినియోగదారులకు హక్కు ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాణానికి, ఆస్తికి ప్రమాదకరమైన వస్తువులు, సేవల మార్కెటింగ్ నుంచి రక్షణ పొందే హక్కు ఉంది. కొనుగోలు చేసిన వస్తువులు, సేవలు స్వల్పకాలిక అవసరాలను మాత్రమే కాకుండా దీర్ఘకాలిక అవసరాలను కూడా తీర్చాలి. ఒక వస్తువును కొనుగోలు చేసే ముందు, వినియోగదారులు ఉత్పత్తుల నాణ్యత, తయారీ, హామీ గురించి ప్రశ్నలు అడగాలి. కొనుగోలు చేసే వస్తువుకు ISI, AGMARK వంటి నాణ్యమైన గుర్తులు ఉన్నాయా, కొనవచ్చా లేదా అని పరిశీలించాలి. ప్రతీ వినియోగదారుడికి ఉన్న కొన్న ప్రాథమిక హక్కులు ఇవే.
ఎంచుకునే హక్కు:
సరసమైన ధరలో నచ్చిన నాణ్యత, సేవను నిర్ధారించే హక్కు వినియోగదారులకు ఉంటుంది. ప్రాథమిక వస్తువులు, సేవలకు కూడా ఈ హక్కు వర్తిస్తుంది. పోటీ ధరలో వివిధ వస్తువులు అందుబాటులో ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలనేది వినియోగదారుల ఎంపికగా ఉండాలి. పోటీ మార్కెట్లో ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించడానికి వినియోగదారులకు పూర్తి హక్కు ఉంది.
సమాచారం పొందే హక్కు:
అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించే విధంగా, వినియోగదారులను రక్షించడానికి వస్తువుల నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రమాణం, ధర గురించి ఎలాంటి దాపరికాల్లేకుండా మార్కెటింగ్ చేయాలి. అడిగి తెలుసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంటుంది. వినియోగదారుడు ఒక వస్తువును కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి లేదా సేవ గురించిన మొత్తం సమాచారాన్ని పొందడానికి వ్యాపార సంస్థను కోరవచ్చు. ఇది వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు ఉండే మార్కెట్ పోటీలో చిక్కుకోకుండా, తెలివిగా, బాధ్యతగా వ్యవహరించడానికి సహాయపడుతుంది. మార్కెట్ అమ్మకాల ఒత్తిళ్లకు లోనుకాకుండా వినియోగదారులు తమను తాము కాపాడుకోవచ్చు.
వినబడే హక్కు:
వినియోగదారుల ప్రయోజనాలు అనేవి సంబంధిత వ్యక్తుల నుంచి సరైన పరిశీలనను పొందడమే. వినియోగదారులు తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు, మనోవేదనలను తగిన ఫోరమ్‌లలో వినిపించేందుకు అనుమతించే హక్కు.
పరిహారం పొందే హక్కు:
అన్యాయమైన వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారులను నిజాయితీ లేని మార్గంలో దోపిడీ చేయడానికి వ్యతిరేకంగా పరిహారం పొందే హక్కును సూచిస్తుంది. వినియోగదారుల నిజమైన ఫిర్యాదులను న్యాయంగా పరిష్కరించే హక్కు కూడా ఇందులో ఉంది. వినియోగదారులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఫిర్యాదు చేయొచ్చు. సంస్థ జరిగిన నష్టపరిహారాన్ని తిరిగి చెల్లిస్తుంది.
ప్రస్తుతం మారిన మార్కెట్ నేపథ్యంలో ఉత్పత్తిదారుడికి, తుది వినియోగదారుడికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయింది. కొనుగోలు చేసిన తర్వాత వచ్చే లోపాలను ఒక బలమైన పరిష్కార పద్ధతి ద్వారా చేరుకోవాలి. దీని కోసం, వినియోగదారుల ఫిర్యాదులు సులభంగా తెలియజేయడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల వివాద పరిష్కార సంస్థలు (వినియోగదారుల ఫోరమ్‌లు లేదా వినియోగదారుల కోర్టులు అని పిలుస్తారు) చట్టం కింద ఏర్పాటు చేశారు.
* వస్తువులు లేదా సేవల విలువ 50 లక్షల రూపాయలకు మించకుండా ఉండే ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా కమిషన్‌లకు అధికార పరిధి ఉంటుంది.
* వస్తువులు లేదా సేవల విలువ 50 లక్షల రూపాయలకు పైన కానీ 2 కోట్ల రూపాయలకు మించకుండా ఉండే ఫిర్యాదులను రాష్ట్ర కమిషన్‌లు స్వీకరించడానికి అధికారం ఉంది.
* వస్తువులు లేదా సేవల విలువ 2 కోట్ల రూపాయలకు పైన ఉంటే అది సంబంధించిన ఫిర్యాదులను జాతీయ కమిషన్ స్వీకరించడానికి అధికారం ఉంది.
ఫిర్యాదును విని, సంస్థ తప్పు చేసిందని నిర్ణయించిన వెంటనే, వినియోగదారుల ఫోరం సంస్థకు ఈ క్రింది చర్యలు తీసుకోవాలని ఆదేశించవచ్చు:
* ఉత్పత్తిలో ఉన్న లోపాలను వారు చెప్పినట్లు సరిచేయమని చెప్పవచ్చు.
* లోపాన్ని లేదా తప్పును ఉచితంగా సరిచేయాలి
* ఉత్పత్తులను ఒకే విధమైన లేదా ఉన్నతమైన ఉత్పత్తితో మార్చడానికి ధరను పూర్తిగా తిరిగి చెల్లించాలి
* నష్టాలు / ఖర్చులు / ఇబ్బందులకు నష్టపరిహారం అందించడం
* ఉత్పత్తి అమ్మకాలను పూర్తిగా తిరిగి తీసుకోవడం
* ఏదైనా అన్యాయమైన వాణిజ్య పద్ధతిని లేదా నియంత్రించబడిన వాణిజ్య పద్ధతిని ఆపడానికి లేదా మళ్లీ చేయకుండా ఉండటానికి ఉత్తర్వు జారీ చేయవచ్చు.
వినియోగదారుల రక్షణ చట్టం:
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి అందుకు సంబంధించిన అధికారులను ఏర్పాటు చేయడానికి ఈ చట్టాన్ఇన తీసుకొచ్చారు. దీనిని వినియోగదారుల రక్షణ చట్టం, 2019గా చెబుతారు.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం.. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి, దానితో సంబంధం ఉన్న విషయాలకు వినియోగదారుల మండళ్లు, ఇతర అధికారులను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం.. వస్తువులు లేదా సేవలలో ఉన్న లోపాలు, లోటుపాట్లకు వ్యతిరేకంగా వినియోగదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడానికి, రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా అన్యాయమైన లేదా తప్పుదోవ పట్టించే చర్యలకు వ్యతిరేకంగా వినియోగదారుల హక్కులను కూడా పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ ప్రశ్నలకు ఓసారి మీకు మీరు వేసుకోండి:
* ఒక వినియోగదారుడిగా మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొన్నారా?
* ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా?
* మీ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక వినియోగదారుల బృందం సహాయం తీసుకోవచ్చని మీకు తెలుసా?
* విమర్శనాత్మకంగా అప్రమత్తంగా ఉంటున్నారా.?
* ధరల గురించి, కొనుగోలు చేసిన వస్తువులు, ఉపయోగించిన సేవల పరిమాణం, నాణ్యత గురించి ఎక్కువ అప్రమత్తంగా ఉండటానికి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారా.?
న్యాయమైన ఒప్పందం: ఒక వినియోగదారుడిగా మీరు న్యాయమైన ఒప్పందాన్ని పొందేలా చూసుకోవాలి. మీరు అజాగ్రత్తగా ఉంటే మోసపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
ఆ బాధ్యత మీదే: వినియోగదారుడిగా మోసాలపై గొంతు ఎత్తే బాధ్యత ఉంది. సమిష్టిగా పోరాడటం, వినియోగదారుల ఆసక్తిని పెంపొందించడానికి, రక్షించడానికి బలం, ప్రభావాన్ని పెంచుకోవడం అవసరం.
స్థిరమైన వినియోగం: మీ వినియోగం ఇతరులపై, ముఖ్యంగా వెనుకబడిన లేదా అధికారరహిత వర్గాల వారిపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం అవసరం. అవసరాల ఆధారంగా వినియోగించడం కూడా అవసరం. మన వినియోగం పర్యావరణ ప్రభావాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలి. సహజ వనరులను పరిరక్షించడానికి, భవిష్యత్ తరాల కోసం భూమిని రక్షించడానికి మన వ్యక్తిగత, సామాజిక బాధ్యతను మనం గుర్తించాలి.
వినియోగదారుల హక్కులు vs బాధ్యతలు:
1) వినే హక్కు:
వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థకు సంబంధించిన కాంటాక్ట్ వివరాలను మీకు అందించారా.? ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ఇన నిర్ధారించుకోవాలి. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి అధికారుల వివరాలను అందించని సంస్థకు చెందిన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయడం ఆపేయండి.
2) ఫిర్యాదుల పరిష్కారం:
* లోపభూయిష్టమైన వస్తువులు, సేవలను కొనుగోలు చేసినప్పుడు జరిగే నష్టాన్ని విస్మరించి, ఫిర్యాదు చేయకుండా ఉండటం అవినీతిపరులైన వ్యాపారవేత్తను ప్రోత్సహించడమే అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. చిన్న నస్టం జరిగినా ఫిర్యాదు చేయొవచ్చు. ఉత్పత్తి లేదా సేవల నాణ్యతలో సంతృప్తి చెందకపోతే, వినియోగదారుడు ఫిర్యాదును నమోదు చేయాలి. నాణ్యమైన పంపిణీ వ్యవస్థ మెరుగుపడుతుందని నిర్ధారించడానికి నియమాలలను తెలుసుకోవాలి.
3) భద్రతా హక్కు:
* వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసేటప్పుడు, వినియోగదారుడు ISI, హాల్‌మార్క్, అగ్‌మార్క్, ISO, FSSAI వంటి ప్రామాణిక నాణ్యత ముద్రను చూడాలి.
* ఎలాంటి ఫేక్, ప్రమాదకరమైన వస్తువులను కొనవద్దు
4) వినియోగదారుల విద్య హక్కు/ సమాచారం పొందే హక్కు
* కేవలం ప్రకటనలకు గుడ్డిగా నమ్మకండి. మార్కెట్ పరిస్థితులను, అభిప్రాయాలను చూడాలి. అదేవిధంగా సంస్థల ఉత్పత్తి, సేవలు నాణ్యత లేనివిగా ఉంటే వెంటనే తెలియజేయాలి.
* వినియోగదారులు ఉత్పత్తి లేదా సేవల నాణ్యత, పరిమాణం, ఉపయోగం, ధర వంటి పూర్తి సమాచారాన్ని పొందడం మీ బాధ్యతగా భావించాలి.
5) ఎంచుకునే హక్కు:
* మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి తెలుసుకోవాలి.
* కొనుగోలు చేసే ముందు వస్తువులు, సేవల వివరాల సూచనలు, పోటీ, సరసమైన ధరలను పోల్చుకోండి.
* ఉత్పత్తులు/సేవల సమీక్షలను సమగ్రంగా చదివిన తర్వాతనే కొనుగోలు చేయండి.
