భళా పోలీస్: పసిపాప పాలప్యాకెట్ కోసం రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు, మంత్రి ప్రశంసలు

పాల కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి గోసను అర్థం చేసుకున్న సదరు కానిస్టేబుల్ స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని స్టేషన్లోకి వచ్చేసరికి రైలు కదలడం ప్రారంభించింది. దీన్ని గమనించిన ఆ సదరు కానిస్టేబుల్ ఒక చేత్తో తన తుపాకిని పట్టుకొని మరొక చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని ప్లాట్ ఫారం వెంట పరుగుతీసి ఆ రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ఆ తల్లికి... ఆ బిడ్డకు పట్టడానికి పాలప్యాకెట్ అందించాడు. 

Constable Sprinted Along Running Train To Give Milk To An Infant: Minister Piyush Goyal Announces Reward

ప్రభుత్వం  నడుపుతున్న శ్రామిక్ రైలు కర్ణాటకలోని బెళగావి నుండి గోరఖ్ పూర్ బయల్దేరింది. ఆ రైల్లో పాల కోసం అలమటిస్తున్న చంటిపాప, ఆ పాపను చూసి నిస్సహాయంగా గోస పడుతున్న చంటిపిల్ల తల్లి కూడా ఉన్నారు. 

ఉదయం రైలు ఎక్కినప్పటినుండి ఆ చంటి పాప పాల కోసం ఏడుస్తూనే ఉంది. కానీ ఆ తల్లికి ఎక్కడా పాలు దొరకడం లేదు. ఇంతలోనే రైలు భోపాల్ స్టేషన్ కి చేరుకుంటుండగా అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను పాపకు పాలు కావాలి అని అడిగింది ఆ తల్లి.  

పాల కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి గోసను అర్థం చేసుకున్న సదరు కానిస్టేబుల్ స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని స్టేషన్లోకి వచ్చేసరికి రైలు కదలడం ప్రారంభించింది. దీన్ని గమనించిన ఆ సదరు కానిస్టేబుల్ ఒక చేత్తో తన తుపాకిని పట్టుకొని మరొక చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని ప్లాట్ ఫారం వెంట పరుగుతీసి ఆ రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ఆ తల్లికి... ఆ బిడ్డకు పట్టడానికి పాలప్యాకెట్ అందించాడు. 

ఇదంతా సీసీటీవీ లో రికార్డు అయింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ కానిస్టేబుల్ ధైర్య సాహసాలను చూసి, అతని సేవాతత్పరతకు మెచ్చి అతడి వీడియోను ట్వీట్ చేస్తూ అభినందనలను తెలపడమే కాకుండా అతడికి నగదు పురస్కారాన్ని కూడా అందించాడు. 

వివరాల్లోకి వెళితే, అతడి పేరు ఇందర్ సింగ్. భోపాల్ స్టేషన్ లో రైల్వే పోలీసుగా  పనిచేస్తున్నాడు. ఆ పాలు అడిగిన మహిళ పేరు షరీఫ్ హష్మీ, భర్త హసీన్ హష్మీతో కలిసి గోరఖ్ పూర్ కి వెళ్తోంది. 

ఉదయం బెళగావి నుంచి రైల్లో బయల్దేరిన ఆ తల్లి పిల్లకు పాల కోసం వెదుకుతూనే ఉంది. కానీ ఎక్కడా పాలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో రైలు భోపాల్ స్టేషన్ లోకి రాగానే అక్కడ కానిస్టేబుల్ ని పాలు తెచ్చివ్వమని కోరింది. 

అతడు స్టేషన్ నుంచి బయటకు వెళ్లి పాలప్యాకెట్ తీసుకొని వచ్చి, పాలప్యాకెట్ ఇద్దామనుకునే సరికి రైలు కదిలింది. అతడు ఆ రైలు వెంట పరుగెత్తాడు. ఆ సమయంలో ఒక చేత్తో తన సర్వీస్ రైఫిల్ ను పట్టుకొని మరోచేత్తో పాల ప్యాకెట్ తో ఆ ఆ రైలు వెంట ఉరుకుతూ ఆ తల్లికి పాల ప్యాకెట్ ని అందించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios