తమిళనాడులోని విల్లుపురంలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ ప్రియురాలిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న కార్తికేయన్ అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌లో సరస్వతి అనే యువతి పరిచయమైంది.

కొద్దిరోజుల్లోనే వీరి పరిచయం ప్రేమగా మారింది. ప్రతిరోజు గంటల తరబడి ఛాటింగ్‌లు, ఫోన్లు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో సరస్వతి పుట్టినరోజు కావడంతో నిన్న రాత్రి గ్రాండ్‌గా సెలబ్రెట్ చేశాడు కార్తికేయన్.. కేక్ కట్ చేసి ఆమెకు తినిపించాడు.  

అనంతరం సర్వీస్ రివాల్వర్‌తో ప్రియురాలిపై కాల్పులు జరిపాడు.. ఆమె చనిపోయిన తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. తుపాకీ చప్పుళ్లు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికి వారు రక్తపు మడుగులో పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు.