ప్రేమ పేరిట తన పై అధికారికి వల వేశాడు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. అతని మాటలను ఆ అధికారిణి పూర్తి గా నమ్మేసింది. తనను తాను సర్వం అర్పించుకుంది. తీరా.. పెళ్లి ఊసు ఎత్తేసరికి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. కాగా.. ఎస్సై ర్యాంకు మహిళా అధికారిణిపై దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాంగఢ్ జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాంగఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళా అధికారిణిపై కానిస్టేబుల్ కన్నేశాడు. ప్రేమిస్తున్నాని వెంట పడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. ఈ క్రమంలో.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు.

కాగా..  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కానిస్టేబుల్ (28) పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి 72 కిలోమీటర్ల దూరంలోని మండు పోలీస్ స్టేషన్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టు ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. తనను పెళ్లి  చేసుకోవడానికి కానిస్టేబుల్ నిరాకరించడంతోపాటు మరో మహిళను పెళ్లాడినట్టు బాధిత ఎస్సై తన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.