రూ.200 కోట్ల మోసం కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్, నటి చాహత్ ఖన్నాకు రూ.100 కోట్ల లీగల్ నోటీసు పంపారు. సుకేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. మీడియాలో తనపై తప్పుడు సమాచారాన్ని పంచుకున్నారని, అతని ఇంటర్వ్యూ సుకేష్ చంద్రశేఖర్ యొక్క సామాజిక ఇమేజ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని లీగల్ నోటీసు పంపారు.
ప్రముఖ టీవీ నటి చాహత్ ఖన్నా వివాదాల్లో చిక్కుకుంది. రూ. 200 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సుఖేష్ ను జైల్లో కలిసిన కారణంగా ఈ కేసులో చాహత్ ఖన్నా కూడా సమన్లు అందుకుంది. అలాగే.. నటి చాహత్ ఖన్నాకు సుఖేష్ .. రూ.100 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నటి చాహత్ .. తనపై తప్పుడు సమాచారం చేసిందనీ, తన సామాజిక ప్రతిష్టను దెబ్బ తీసేలా.. తీవ్ర ఆరోపణలు చేసిందని , రూ.100 కోట్ల లీగల్ నోటీసు పంపారు.
నోటీసులో ఏముంది?
"మా క్లయింట్ సుకేష్ చంద్రశేఖర్ తరపున మేము మీకు ఈ నోటీసు పంపుతున్నాము" అని ఈ నోటీసులో చెప్పబడింది. అవమానకరమైన ప్రకటనలు చేసినందుకు, చాహత్ ఖన్నా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, 100 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కోరారు. నటి ప్రకటనతో సుకేష్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, అలాగే మానసికంగా బాధపడ్డానని నోటీసులో పేర్కొన్నారు.
ఇంతకీ చాహత్ ఖన్నా ఏం ప్రకటన చేసింది?
జనవరి 29న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో చాహత్ ఖన్నా మాట్లాడుతూ.. తనని ట్రాప్ చేసి తీహార్ జైలుకు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ పిలిపించుకున్నాడని వెల్లడించింది. ఆ సమయంలో సుఖేష్ తాను దివంగత జయలలిత మేనల్లుడిని, ఒక ప్రముఖ దక్షిణ భారత టీవీ ఛానెల్ యజమానిని కలుస్తున్నానని అనుకున్నానని చాహత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకి పెద్ద అభిమానిని అని, తన టీవీ షో బడే అచ్చే లాగ్తే హైని రెగ్యూలర్ గా చూశానన్నాడని తెలిపాడనీ, తనని కలవాలనుకుంటున్నానని చెప్పాడని తెలిపింది.
ఆ సమయంలో సుకేష్ మోకాళ్లపై కూర్చోని పెళ్లి ప్రపోజ్ చేశాడని సంచలన ప్రకటన చేసింది. అయితే.. తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబితే.. తన భర్త తనకు సరైన వ్యక్తి కాదని అన్నాడనీ, ఆ సమయంలో తనకు ప్రపోజ్ చేస్తున్నది సుఖేష్ అని తనకు తెలుసని వెల్లడించింది. జైళ్లో ఉన్న సుఖేష్ తనని ట్రాప్ చేసిన తీహార్ జైలుకు రప్పించుకున్నాడనీ, ఓ మహిళ తన పేరు ఏంజెల్ ఖాన్ (పింకీ ఇరానీ) అని వెల్లడించి.. ఈవెంట్‌కు ఉందని చెప్పి..తిహార్‌కు తీసుకువెళ్లిందనీ, అక్కడ ఆమె సుకేష్‌ను కలుసుకుందని తెలిపింది.
నటి చాహత్ వాదనను సుఖేష్ కొట్టిపారేశారు. ఆమెను ప్రపోజ్ చేశాననే వాదనను ఖండించాడు. ఈ క్రమంలో సుకేష్ .. నటికి లీగల్ నోటీసు పంపాడు. అవమానకరమైన ప్రకటనలు చేసినందుకు.. చాహత్ ఖన్నా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రూ. 100 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కోరారు.
నటి ప్రకటనతో సుకేష్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, అలాగే మానసికంగా బాధపడ్డానని నోటీసులో పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీపై విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కోర్టులో తదుపరి విచారణకు రానుంది. జైల్లో సుఖేష్ ను కలిసిన కారణంగా ఈ కేసులో చాహత్ ఖన్నా కూడా సమన్లు అందుకుంది. మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
