లక్నో: రేపిస్ట్ ను టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత తారాయాదవ్ పై ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలే దాడికి దిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని హత్రాస్ లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున  కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో రేపిస్ట్ ను ఎన్నికల బరిలో నిలబెట్టడం సరైందికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో ఆమె లేవనెత్తారు.

పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొనే వారు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభమైంది.  

ముకుంద్ భాస్కర్ అనే రేపిస్ట్ కు టికెట్ ఇవ్వడాన్ని తాను ప్రశ్నించినందుకు తనపై దాడికి దిగినట్టుగా ఆమె ఆరోపించారు. ఈ విషయమై తాను ప్రియాంక గాంధీ ఏం చర్యలు తీసుకొంటారోననే ఆమె చెప్పారు.

మహిళా నేతపై దాడి విషయాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సీరియస్ గా తీసుకొంది. మహిళపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఎన్‌సీడబ్ల్యు ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఓ వీడియోను షేర్ చేసింది. పార్టీ సమావేశంలో పార్టీ మహిళా నేతపై గూండాల మాదిరిగా దాడి చేశారని ఆమె ఆరోపించింది. వీరికి శిక్ష పడాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.